Saturday, May 4, 2024
- Advertisement -

ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల్లో మూడు కొత్త పాటలు

- Advertisement -

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, వ‌రుణ్‌తేజ, సాయిధ‌ర‌మ్‌తేజ్‌, రెజీనా, మెహ్రీన్‌, లావ‌ణ్య త్రిపాఠి, రీతూవ‌ర్మ‌, జ‌య‌సుధ‌, ప్ర‌గ‌తి, అన్న‌పూర్ణ‌, యాంక‌ర్లు సుమ‌, ఝాన్సీ, ఉద‌య‌భాను, గాయ‌కులు సునీత‌, హేమంత్ త‌దిత‌రులు ప్రపంచ తెలుగు మ‌హాస‌భ‌ల్లో ఆడిపాడారు. తెలుగు మ‌హాస‌భ‌లను పుర‌స్క‌రించుకొని తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా రూపొందించిన మూడు పాట‌లు ఈ వేడుక‌ల్లో ఆవిష్క‌రించారు. తెలుగు సినీ తారాగ‌ణంతో ఆ పాట‌లు నిండుకుండా ఉన్నాయి. తెలుగుకు తార‌తోర‌ణ‌మై పాట‌లు రూపొందించారు. తెలుగు మ‌హాస‌భ‌ల్లో ప్ర‌ద‌ర్శించిన ఈ మూడు పాట‌లు ఆక‌ట్టుకున్నాయి.

హోలీ పాట‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మెహ్రీన్ డ్యాన్స్‌లు చేయ‌గా… బ‌తుక‌మ్మ పాట‌లో స‌హ‌జ న‌టి జ‌య‌సుధ‌, అన్న‌పూర్ణ‌, ప్ర‌గ‌తి, హీరోయిన్ రెజీనా, ఢిల్లీ రాజేశ్వ‌రి, యాంక‌ర్లు సుమ‌, ఉద‌య‌భాను, ఝాన్సీ త‌దిత‌ర మ‌హిళా న‌టులు మ‌ణులుగా పాట‌లో ఉన్నారు. పాట చివ‌ర‌లో జ‌య‌సుధ వ‌చ్చి బతుక‌మ్మ‌ను సాగ‌నంప‌డం ఆక‌ట్టుకుంది.

ఇక తెలంగాణ క‌వులు, ర‌చ‌యిత‌లను కీర్తిస్తూ జ‌య‌హో అనే పాట విడుద‌లైంది. ఈ పాట‌లో మ‌న తెలుగు సినీ తార‌లు మెరిశారు. తొలుత గాయ‌కుడు రేవంత్ రాగా, రీతూవ‌ర్మ‌, లావ‌ణ్య త్రిపాఠి, వ‌రుణ్‌తేజ‌, న‌వీన్‌చంద్ర‌, రాజ్‌త‌రుణ్‌, సాయిధ‌ర‌మ్‌తేజ్‌, హిబ్బా ప‌టేల్‌, శాలినీ పాండే, గాయ‌ని సునీత‌, సునీల్‌, ర‌చ‌యిత చంద్ర‌బోస్ ఇలా ఎంద‌రో సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారు పాట‌లో మెరిశారు.

ఈ విధంగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను తెలుగు మ‌హాస‌భ‌ల్లో భాగ‌స్వామ్యం చేసిన ఘ‌నత మాత్రం తెలంగాణ ప్ర‌భుత్వానికి ద‌క్కింది. గ‌తంలో ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తిరుప‌తిలో నిర్వ‌హించిన ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు ఎప్పుడు జ‌రిగాయో, ఎలా జ‌రిగాయో ఎవ‌రికీ తెలియ‌ని ప‌రిస్థితి. ఈవిధంగా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -