Saturday, May 11, 2024
- Advertisement -

వైజాగ్ కు టాలీవుడ్ షిఫ్ట్!

- Advertisement -

ఇప్పటికిప్పుడు ఈ విషయం సాధ్యం కాకపోవచ్చేమో కానీ.. ఫ్యూచర్ లో మాత్రం డెఫినెట్ గా.. టాలీవుడ్ వైజాగ్ కు వెళ్లిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విశాఖలో రామానాయుడు స్టుడియో ఉంది. చిరంజీవి కూడా అక్కడ స్టుడియో ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు ఏనాటినుంచో వినిపిస్తోంది.

అన్నీ అనుకున్నట్టు జరిగి చిరు రంగంలోకి దిగితే.. సినీ తారలను దగ్గరకు తీసే సీఎం చంద్రబాబు కూడా.. కాదు అనే అవకాశమే లేదు. హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోస్ కు సంబంధించిన భూముల వ్యవహారంతో.. నాగార్జున ఇప్పటికే కొన్ని ఇబ్బందులు పడ్డారు. ఆయన కూడా వైజాగ్ వైపే చూసే అవకాశం ఉంది. ఇప్పుడు తాజాగా.. లోక నాయకుడు, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూడా వైజాగ్ పై కాన్సన్ ట్రేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

రీసెంట్ గా.. అమరావతి శంకుస్థాపనకు శుభాకాంక్షల పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన కమల్.. ఇంకొన్ని కీలక విషయాలపైనా గుట్టుగా చర్చలు జరిపినట్టు టాక్ వినిపిస్తోంది. వైజాగ్ లో సినిమా స్టుడియో పెట్టాలన్న ఆలోచన కూడా అందులో ఒకటిగా తెలుస్తోంది. కమల్ కు ఉన్నట్టుండి విశాఖలో స్టుడియో పెట్టాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్నకొస్తే.. చాలా సమాధానాలే వినిపిస్తున్నాయి. 

తమిళ సినీ పరిశ్రమకు వైజాగ్ ప్రాంతం అనువైనది కావడంతో పాటు.. ఏపీలో సినీ పరిశ్రమ విస్తరణకు అవకాశాలు ఉండడం.. అదీ కాక.. ముందు నుంచీ ఫిల్మ్ ఇండస్ట్రీతో మంచి రాపో మెయింటైన్ చేస్తున్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం.. ఇవన్నీ లెక్కలేసుకున్నాకే… కమల్ టాలీవుడ్ వైపు… ముఖ్యంగా వైజాగ్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతానికి వైజాగ్ లో కమల్ స్టుడియోపై క్లారిటీ లేకున్నా.. ముందు ముందు అన్ని విషయాలు బయటికి రాక మానవు. టాలీవుడ్ లో వినిపిస్తున్న ఈ రూమర్ వాస్తవ రూపం దాలిస్తే… హైదరాబాద్ నుంచి వైజాగ్ కు చిత్రపరిశ్రమ దాదాపుగా రీ షిఫ్ట్ అవడం ఖాయం. ఎందుకంటే.. అంతకుముందు చెన్నై నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లో సెటిలైనట్టే.. ఇప్పుడు వైజాగ్ లో సెటిలైతే తప్పేంటన్న వాదన కూడా సినీ పెద్దలు చేసేయొచ్చు. అదే రీజన్ తో ఒకరి వెంట ఒకరు హైదరాబాద్ టు వైజాగ్ వెళ్లిపోనూవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -