Saturday, May 11, 2024
- Advertisement -

మోడీతో కేసీఆర్ కలిసిపోయినట్టే(నా)!

- Advertisement -

కొన్నాళ్లుగా కేంద్ర ప్రభుత్వంతో.. తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ అనుసరిస్తున్న వైఖరి గమనిస్తుంటే.. చాలా మార్పు కనిపిస్తోంది. మాట మాట్లాడితే.. కేంద్రాన్ని విమర్శించిన తీరు నుంచి మొదలు పెట్టి.. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ ను టీఆర్ఎస్ ఎంపీలు పొగడడం, సంక్షేమ పథకాల అమలు విషయంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని.. ప్రధాని మోడీ అభినందించడం వరకూ.. పరిస్థితులు మారినట్టే అర్థమవుతోంది.

ఇప్పటికిప్పుడు కాకపోయినా.. మరో ఏడాదిలో అయినా.. బీజేపీకి టీఆర్ఎస్ దగ్గరయ్యేందుకు.. ప్రస్తుత పరిణామాలే ఆధారంగా నిలిచే సిచువేషన్ కనిపిస్తోంది. తెలంగాణలో బలపడాలంటే టీఆర్ఎస్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేకపోవడం బీజేపీకి బలహీనంగా మారుతుంటే.. అభివృద్ధికి కేంద్రంతో సంబంధాలే కీలకం కానుండడం టీఆర్ఎస్ ప్రభుత్వానికి అవసరంగా మారుతున్నాయి.

ఇదే.. టీఆర్ఎస్ ను బీజేపీకి దగ్గర చేసి ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ టెంపో ఇలాగే కొనసాగితే.. ఫ్యూచర్ లో.. తెలంగాణలో టీఆర్ఎస్ తో.. ఏపీలో టీడీపీతో కలిసి బీజేపీ అడుగులు వేసే అవకాశం ఉందని అనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -