Monday, May 13, 2024
- Advertisement -

జమ్మూ,కాశ్మీర్ భారత్ దే…ఐక్యరాజ్యసమితిలో ఒప్పుకున్న పాక్ విదేశాంగ మంత్రి…

- Advertisement -

కాశ్మీర్ విషయంలో భారత్ పై ఎప్పుడూ విషం కక్కే పాక్ తాజాగా ఐక్యరాజ్యసమితిలో ఎట్టకేలకు జమ్మూ,కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని ఒప్పేసుకుంది. జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్ సమావేశంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి ప్రసంగించారు.

ప్రసంగంలో ఎప్పటిలాగానె కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ విషం గక్కాలని చూశారు.అంతర్జాతీయ వేదికపై భారత్‌ను దోషిగా నిలబెట్టేందుకు విఫల యత్నాలు చేస్తూనే ఉంది పాక్. కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం అని పాక్ తెలుసు ప్రపంచానికి తెలుసు.పైకి మాత్రం కశ్మీర్ తమదేనంటూ బుకాయిస్తుంది. కానీ ఎట్టకేలకు పాకిస్తాన్ నిజం ఒప్పుకుంది. కశ్మీర్ భారత్‌దేని ఐక్యరాజ్యసమితి వేదికగా వెల్లడించింది.

జమ్మూకశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని తక్కిన ప్రపంచాన్ని నమ్మించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం ఏకపక్షంగా రద్దుచేసింది.. ఇది అంతర్జాతీయ నియామలకు విరుద్ధమని ఆరోపించారు. మానవ హక్కుల ఉల్లంఘన యదేచ్ఛగా జరగుతోందని ఆరోపించారు.సాధారణ జనజీవనం ఉంటే అంతర్జాతీయ మీడియాను ఎందుకు అనుమతించడంలేదు? అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థలను ఎందుకు అడుగుపెట్టనివ్వడంలేదు? భారత్ లోని జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో వాస్తవ పరిస్థితిని అంచనా వేయడానికి ఎందుకు ఒప్పుకోవడంలేదు?” అంటూ ప్రశ్నించారు.

తన ప్రసంగంలో ‘ఇండియన్ స్టేట్ ఆఫ్ కశ్మీర్ భారత రాష్ట్రమైన కశ్మీర్అని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌‌పై అబద్ధపు ఆరోపణలు చేస్తూనే.. కశ్మీర్ భారత రాష్ట్రమని ఉచ్ఛరించారు ఖురేషీ. తర్వాత అసలు విషయం తెలిసి నాలుక కర్చుకున్నారు. వ్యాఖ్యలను బట్టి చూస్తే భారత్ వ్యవహారాల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకోవాలని చూస్తోందన్న విషయం అంతర్జాతీయంగా స్పష్టమైంది విశ్లేషకులు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -