Saturday, May 4, 2024
- Advertisement -

సుప్రీంకోర్టులో ఖాళీలు.. ఎంత మందికి అవకాశం అంటే..!

- Advertisement -

సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకం కోసం న్యాయ మంత్రిత్వ శాఖకు కొలీజియం సిఫార్సులు చేయనుంది. 2019లో జస్టిస్ రంజన్​ గొగోయి​ పదవీ విరమణతో ఓ ఖాళీ ఏర్పడగా.. జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అరుణ్ మిశ్రాల పదవీ విరమణతో మొత్తం నాలుగు ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం 34 మంది న్యాయమూర్తులకు గాను.. 30 మంది న్యాయమూర్తులతోనే సుప్రీంకోర్టు విధులు నిర్వహిస్తోంది.

ఈ అంశంపై స్పందించిన ప్రభుత్వం న్యాయమూర్తుల నియామకం అనేది కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల మధ్య జరిగే నిరంతర ప్రక్రియని పేర్కొంది. దీనికి రాజ్యాంగ నిపుణుల సంప్రదింపులతో పాటు ఆమోదం అవసరమని తెలిపింది.

మొత్తం ఐదుగురు న్యాయమూర్తులకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ ఇటీవలే సిఫారసు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. ఇప్పటికే నలుగురి నియామకం పూర్తి కాగా.. గువాహటి హైకోర్టు సీజే నియామక ప్రక్రియ కూడా ఈ వారం పూర్తి అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -