Saturday, April 27, 2024
- Advertisement -

ఈడీ ఎంటరైతే..బాబు సంగతి అంతేనా!

- Advertisement -

ఏపీ రాజధానిగా అమరావతి సంగతి ఏమో కానీ ఇదే ఇష్యూ ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబును వెంటాడుతోంది. అమరావతి రాజధాని నిర్మాణం ఇన్ఫ్రా స్ట్రక్చర్ సబ్ కాంట్రాక్ట్ ల నుంచి చంద్రబాబుకు వందల కోట్ల ముడుపులు అందాయని ఐటీ నోటీసులు జారీ చేసింది. దాదాపు రూ.118 కోట్ల ముడుపులు అందాయని ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేయగా అంతకన్న ఎక్కువగానే చంద్రబాబు నొక్కేసారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

దీనిని అవినీతిగా ఎందుకు పరిగణించకూడదని చంద్రబాబును ఐటీ ప్రశ్నించగా ఊహించని ఈ పరిణామంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా ఐటీ నోటీసులకు తోడు ఈడీ కూడా ఎంటరవుతందని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఇది చంద్రబాబుకు,టీడీపీకి గట్టి షాకే. ఎన్నికల వేళ ఈ ఐటీ సునామీ నుండి ఎలా బయటపడాలో తెలియక చంద్రబాబు అండ్ టీం మల్లగుల్లాలు పడుతున్నారట.

టీడీపీని ఇబ్బందిపెట్టే ఈ చిన్న అవకాశం దొరికిన వదిలిపెట్టని వైసీపీ నేతలు దీనిపై పదేపదే ప్రశ్నలు గుప్పిస్తున్నారు. రూ.118 కోట్ల జస్ట్ శాంపిల్ మాత్రమేనని ఈ మొత్తం వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగితే మొత్తం ఎన్ని వందల కోట్లు నొక్కేశారో బయటపడుతుందని చెబుతున్నారు. అంతేగాదు ఐటీ నోటీసులపై టీడీపీ నేతలు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక వైసీపీ నేతలు పనిలో పనిగా చంద్రబాబు, లోకేశ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

వైసీపీ నేతల వ్యాఖ్యలతో టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది. ఈ వ్యవహారం నుండి టీడీపీ గట్టెక్కాలంటే బీజేపీతో మైత్రి కంపల్సరీ. ఒకవేళ పొరపాటున మైత్రి బంధం చెడి కేంద్రం ఎంటరైందా టీడీపీ,చంద్రబాబు పరిస్థితి ఏంటా అని లోలోపల మదనపడిపోతున్నారు. ఎందుకంటే కేంద్రం కనుసన్నల్లోని దర్యాప్తు సంస్థలు ఈ వ్యవహారంలో రంగంలోకి దిగితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో ఏం జరిగిందో బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నెక్ట్స్ స్టెప్ ఏంటా అనే దానిపై ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -