Thursday, May 16, 2024
- Advertisement -

చంద్ర‌బాబు ప‌రువు తీస్తున్న తెలుగు త‌మ్ముళ్లు…

- Advertisement -
War between Karanam Balaram And Gottipati Ravi Kumar

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష‌మే లేకుండా దెబ్బ‌తీయాల‌ని చంద్ర‌బాబు ప‌న్ని ప‌న్నాగాలు ఇప్పుడు బాబు మెడ‌కు చుట్టుకుంటున్నాయి,ఇత‌ర పార్టీలోని ఎమ్మెల్యేల‌ను పిరాయింపుల ద్వారా పార్టీలోకి చేర్చుకున్న బాబు సంతోషం ఇప్పుడు ఆవిరైపోతోంది. పిరాయింపు అనే పాముకు పాలు పోసి పోషించిన ఆ పామే ఇప్పుడు బాబును కాటేస్తోంది.

రాజ‌కీయాల‌లో స్వార్థం స‌హ‌జం..కాని మితిమీరిన స్వార్థం చివ‌రికి త‌మ‌కే మ‌న‌శ్శాంతి లేకుండా చేస్తుంది.ఇప్పుడు చంద్ర‌బాబు ప‌రిస్థితి కూడా అంతే.స్వార్థ రాజ‌కీయం కోసం నిస్సిగ్గుగా పార్టీ పిరాయింపుల‌ను ప్రోత్స‌హించారు.స్తానికి టీడీపీ నేత‌లు వ‌ద్ద‌ని ఎంత చెప్పినా బాబు విన‌లేదు.ఇప్పుడు స్తానికి టీడీపీ నాయ‌కుల‌కు..ఇత‌ర పార్టీల‌నుంచి వ‌చ్చిన నాయ‌కుల‌కు మ‌ద్య విబేధాలు తారాస్థాయికి చేరాయి.ఒక వైపు రాష్ట్ర స‌మ‌స్య‌లు,టీడీపీ శ్రేణుల‌లో పుట్టుకొస్తున్న విబేధాలు బాబుకు నిద్ర‌ప‌ట్ట‌డంలేదు.

{loadmodule mod_custom,Side Ad 1}

మంత్రి వ‌ర్గ విస్త‌రన‌ను ఏముహూర్తంలో మొద‌లు పెట్టాడో గాని అప్ప‌టినుంచి బాబుకు ఎక్క‌వ‌య్యాయి.మంత్రి ప‌ద‌వులు ఆశించిన వారికి రాక‌పోవ‌డంతో వారిలోఅసంతృప్తి పెరిగిపోతోంది. ఎమ్మెల్యేల‌పై వ‌స్తున్న అవినీతి ఆరోప‌న‌లు…ఇసుక మాఫియా..రాజ‌కీయ హ‌త్య‌లు ఇవ‌న్నీ బాబును గుక్క‌తిప్పుకోలేకుండా చేస్తున్నాయి.రోజురోజుర‌కీ ప్ర‌జాద‌ర‌న త‌గ్గిపోవ‌డం…మిత్ర‌ప‌క్షం బాజాపా విమ‌ర్శ‌ల తాకిడి త‌ట్టుకోలేక‌పోతున్నారు.
ఇప్పుడు తాజాగా ఒంగోలు టీడీపీలో విబేధాలు తార‌స్థాయికి చేర‌కున్నాయి.ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నప్పటికీ చంద్రబాబు ఫిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ను టీడీపీలోకి తీసుకోవడంతో సీనియర్ నేత కరణం బలరాం తొలి నుంచి రగిలిపోతున్నారు. క‌ర‌ణం ఎతం చెప్పినా బాబు విన‌కుండా ..లోకేష్ ప్రోత్బ‌లంతో గొట్టిపాటి ర‌విని పార్టీలోకి తీసుకున్నారు.ఆ త‌ప్పే ఇప్పుడు బాబును కాల్చుకుతింటోంది.
మూడురోజుల క్రితం వేమవరంలో కరణం బలరాం అనుచరులు ఇద్దరిని గొట్టిపాటి వర్గీయులు దారుణంగా హత్యలు చేయడంతో పోరు మళ్లీ మొదలైంది. మూడు రోజులుగా సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకుంటున్న గొట్టిపాటి, కరణం బలరాంలు… జిల్లా అధ్యక్షుడి ఎన్నికల సందర్భంగా నేరుగా తలపడ్డారు. అనుచరుల కంటే దూకుడుగా కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ పరస్పరం కొట్టుకున్నారు. ఒంగోలులోని ఒక ఫంక్షన్ హాల్ ఇందుకు వేదికైంది.

{loadmodule mod_custom,Side Ad 2}

ఇది ఇలా నెల్లూరు వాకాటి నారాయ‌న రెడ్డిని పార్టీలోకి చేర్చుకొని ఎమ్మెల్సీ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు.కాని బ్యాంకుల‌కు రుణాలు ఎగ్గొట్ట‌డంతో ఐటీ అధికార‌లు సోదాలు నిర్వ‌హించారు.దీంతో బాబుకు చేసేదిలేక ఎక్క‌డ విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌న్న భ‌యంతో పార్టీనుంచి స‌స్పెండ్ చేశారు. ఇప్పుడు ప‌త్తికొండ నియేజ‌క‌వ‌ర్త‌గంలో వైసీపీ నేత నారాయ‌ణ‌రెడ్డి హ‌త్య కేసులో బాబు,రెవిన్యూమంత్రి కే.యీ. కృష్ణ‌మూర్తి పైనే అరోప‌న‌లు వెల్లువెత్తుతున్నాయి.ఇవి ముమ్మాటికి రాజ‌కీయ హ‌త్య‌లేన‌ని ప్ర‌తి ప‌క్షాలు ఆరోపిస్తున్నాయి.
బాబు ప‌రువును తెలుగు త‌మ్మ‌ళ్లే బ‌జారుకీడుస్తున్నారు.బాబు న‌చ్చ‌జెప్పినా ఎవ‌రు విన‌క‌పోవ‌డంతో బాబుకు ఏంచేయాలో తొచ‌డంలేదు.రాష్ట్ర‌లో ఏజిల్లాలో చూసుకున్న టీడీపీలో విబేధాలు బ‌గ్గుమంటున్నాయి. త‌మ స్వార్థం కోసం పార్టీ పిరాయింపుల‌ను ప్రోత్స‌హించి బాబుకు అదే నిద్ర‌లేకుండా చేస్తోంది.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -