Sunday, May 12, 2024
- Advertisement -

అభ్య‌ర్తుల మ‌ద్య‌న వార్ కాదు…. అధినేత‌ల మ‌ధ్య‌న వార్‌…

- Advertisement -
War Satrts in Nandyal By Election

టీడీపీ సీనియర్ నేత భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఖాళీ ఏర్పడిన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరుగనుంది.అబ్య‌ర్తుల మ‌ధ్య కాకుండా ఇరు పార్టీల అధినేత‌ల మ‌ధ్య ఉప ఎన్నిక యుద్దం మొద‌ల‌య్యింది.

మామూలుగా అయితే ఉప ఎన్నిక‌ను ఇంత ప్ర‌తీస్టాత్మ‌కంగా తీసుకున్న దాఖ‌లాలు లేవు..మ‌రి నంద్యాలలో గెలవటం ఇపుడు రెండు పార్టీలకు ఇజ్జ‌త్‌మే స‌వాల్‌గా మారింది.

{loadmodule mod_custom,GA1}

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఉపఎన్నిక కాబట్టే అంతలా వేడి రాజుకుంటోంది.అధికార-ప్రతిపక్షాలు రెండూ తమ అభ్యర్ధులను ప్రకటించేయటంతో నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా అంతటా ఒక్కసారిగా ఎన్నికల వేడి రాజుకుంది.భూమా క‌ర‌నించిన‌ప్ప‌టినుంచి రాష్ట్ర రాజ‌కీయాలు నంద్యాల చుట్టూనే తిరిగాయ‌నేది స‌త్యం.నంద్యాల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పకనర్లేదు. అందుకే జనాలంతా అంతటి ఆసక్తిని కనబరుస్తున్నారు.
టిడిపి తరపున భూమా బ్రహ్మానందరెడ్డిని చంద్రబాబునాయుడు ఇప్పటికే ప్రకటించగా ఆదివారం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా శిల్సా మోహన్ రెడ్డి అభ్యర్ధిత్వాన్ని ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకే శిల్పా టిడిపి నుండి వైసీపీలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే శిల్పా వైసీపీలో చేరారో నియోజకవర్గంలో టిడిపి దాదాపు ఖాళీ అయిపోయింది.మున్సిపల్ కౌన్సిలర్లు, జడ్పీటీసీ, ఎంపిటీసీలు, సర్పంచులతో పాటు మండల, గ్రామస్ధాయి నేతలు సుమారు 2 వేల మంది వైసీపీలో చేరిపోయారు.

{loadmodule mod_custom,GA2}

దీంతో ఖంగుతిన్న చంద్ర‌బాబు అనేకమార్లు సర్వేలు కూడా చేయించారు. అన్నింటిలోనూ వ్యతిరేక ఫలితమే రావటం కూడా చంద్రబాబు ఇబ్బందులకు కారణమైంది.ఉపఎన్నిక నిర్వహణకు ఎన్నికల కమీషన్ షెడ్యూల్ ప్రకటించటమే ఆలస్యమన్నట్లుగా ఉంది పరిస్ధితి.ఒక వైపు ఎన్నిక‌ను ఏక‌గ్రీవం చేద్దామ‌ని బాబు చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి.అభ్యర్ధిగా శిల్పా ను ప్రకటించటంతో నంద్యాలను ఏకగ్రీవంగా టిడిపికి కట్టబెట్టేందుకు జగన్ అంగీకరించటం లేదన్నవిషయం స్పష్టమైపోయింది. నంద్యాల రేసులో ఎవ‌రుగెలుస్తారో చూద్దాం.

{loadmodule mod_sp_social,Follow Us}
Also Read

{youtube}87tZ9NmUdE0{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -