Tuesday, May 14, 2024
- Advertisement -

వాట్సాప్ లో కొత్త ఫీచర్ వచ్చేస్తోంది…

- Advertisement -

సోషల్‌ మీడియా యాప్‌లో వాట్సాప్‌ కున్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఎప్పటికప్పుడు సరి కొత్త ఫీచర్లతో ఈ యాప్ అలరిస్తూనే ఉంది. తాజాగా వాట్సాప్‌ గ్రూప్‌ వాయిస్‌, వీడియో కాలింగ్‌ ఫీచర్‌ను కూడా యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఐఫోన్‌ యాప్‌ లేటెస్ట్‌ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. ఇప్పటికే వాట్సాప్‌ ఈ ఏడాదిలో పలు ఫీచర్లను ప్రవేశపెట్టి, 1 బిలియన్‌కు పైగా యూజర్లను తన సొంతం చేసుకుంది.

తాజాగా ఐఫోన్లలో ఉప‌యోగించే వాట్సాప్ అప్‌డేట్ కోడ్‌లో …ఈ సబ్జెక్ట్ కు సంబంధించి టెక్నికల్ వాల్యూస్ ఉన్నట్లు ఇంటర్నేషనల్ టెక్నిక‌ల్ వెబ్‌సైట్లు మరీ మరీ చెబుతున్నాయి. 2.17.70 ఐఓఎస్‌ అప్‌డేట్‌లో గ్రూప్‌ కాల్స్‌కు సంబంధించిన సూచనలు కలిగి ఉందని, ప్రస్తుతం ఇది కన్ఫామ్ అయినట్లు డబ్ల్యూఏబీటాఇన్ఫో మొన్న ఆదివారం తన ట్వీట్‌ తో నెటిజన్లకు సమాచారాన్ని అందించింది.

గ్రూప్‌ వాయిస్‌ కాల్స్‌ గురించి చాలా సమాచారం ఉన్నప్పటికీ, గ్రూప్‌ వీడియో కాల్స్‌కు సంబంధించి ఒకే ఒక సంకేతం మాత్రం ఉన్నట్టు పేర్కొంది. గ్రూప్‌ వాయిస్‌ కాల్స్‌కు ఫీచర్‌పై ఈ యాప్‌ ప్రస్తుతానికి పనిచేస్తుందని, వచ్చే ఏడాది దీనిని రిలీజ్ చేయబోతున్నట్లు పలు రిపోర్టులు చెబుతున్నాయి. గ్రూప్ వీడియో కాలింగ్ గురించి కొద్దిగా డౌట్ ఉన్నా… గ్రూప్ వాయిస్ కాలింగ్ స‌దుపాయాన్ని మాత్రం వాట్సాప్ త్వర‌లో త‌ప్పకుండా ప్రవేశ పెట్టనుందని తెలుస్తోంది. కాని ఈ ఫీచ‌ర్లు ఎప్పటికి అందుబాటులోకి వ‌స్తాయనే విష‌యం ఇంకా తేలాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -