- Advertisement -

ఆగస్టులో బాబు ప్రభుత్వం కూలిపోతుంది.. పడగొట్టేదెవరు?!

- Advertisement -

మొన్ననేమో బాబు ప్రభుత్వానికి ప్రమాద ఘంటికలు మోగాయి.. తెలంగాణలో ఓటుకు నోటు స్కామ్ లో తెలుగుదేశం ఎమ్మెల్యే ఇరుక్కుపోవడం.. ఈ విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు కూడా తెలంగాణ ఏసీబీ నోటీసులు ఇస్తుందనే ప్రచారం..

ఆ నోటీసుల ఫలితంగా బాబు రాజీనామా చేయాల్సి రానుందనే పుకార్లు ఊపందుకొన్నాయి.  

బాబు రాజీనామా చేస్తే.. నెక్ట్స్ ముఖ్యమంత్రి ఎవరు? అనే అంశంపై కూడా చర్చ జరిగింది. మరి చివరకు అలాంటి ప్రమాదం ఏమీ జరగలేదు.

బాబు ఆ వ్యవహారం నుంచి సేఫ్ గా బయటపడినట్టేనని తెలుస్తోంది. మరి అలాంటి ప్రమాదాన్ని తప్పించుకొన్నప్పటికీ బాబు ప్రభుత్వానికి ముప్పు తొలగిపోలేదని అంటున్నాడు తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ . బాబు ప్రభుత్వం ఆగస్టు కల్లా కూలిపోవడం ఖాయం అని ఆయన అంటున్నాడు. ఆగస్టు సంక్షోభం తప్పదని ఆయన స్పష్టం చేస్తున్నాడు. మరి ఇది ఒకింత సంచలన ప్రకటనే!

బాబు ప్రభుత్వం కూలిపోతుందని ఒక మాజీ ఎంపీ స్థాయి వ్యక్తి అనడంతో..ఏదైనా రాజకీయ సంచలనం జరుగతుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. సంపూర్ణమెజారిటీ ఉన్న బాబు ప్రభుత్వం పడిపోవడం అంటే మాటలు కాదు కదా! అది సంచలనమే. మరి ఎవరు కూలగొడతారు? బాబు ప్రభుత్వం ఎలా పడిపోతుంది? చింతా మోహన్ చెప్పినట్టుగా నిజంగానే ఏపీకి మధ్యంతర ఎన్నికలు వస్తాయా? అనేవి ఆయన మాటలు విన్నాకా కలిగే సందేహాలు. మరి ఆగస్టులోనే అంటున్నాడు కదా.. ఆయన జోస్యం ఫలిస్తుందా? లేదా? అనే అంశం త్వరలోనే తేలిపోతుంది కదా! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -