Wednesday, April 24, 2024
- Advertisement -

ఏపీలో బడులు స్టార్ట్ .. ఎప్పటినుంచంటే?

- Advertisement -

కరోనా ఎఫెక్ట్​తో విద్యార్థులు పాఠశాలల మొహం చూడక చాలా రోజులైంది. కేవలం ఆన్​లైన్​ క్లాసులు మాత్రమే వింటున్నారు. పట్టణ ప్రాంత విద్యార్థులకు పెద్దగా ఇబ్బంది లేదుగానీ.. పల్లె ప్రాంతాల్లోని విద్యార్థులకు ఆన్​లైన్​ క్లాసులు వినడం కాస్త కష్టతరంగానే ఉంది. విద్యుత్​, ఇంటర్నెట్​ అంతరాయాలు, మరికొందరికి స్మార్ట్​ ఫోన్లు కొనే స్తోమత లేకపోవడం వెరసి విద్యార్థులకు విద్యాబోధన సాగడం లేదు.

ఇదిలా ఉంటే ఏపీలో పాఠశాలలు ప్రారంభించాలని సీఎం జగన్​ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్ట్​ 16 నుంచి స్కూల్స్​ ఓపెన్​ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నెల 12నుంచి విద్యార్థులకు ఆన్​లైన్​ క్లాసులు ప్రారంభించబోతున్నారు. ఇవాళ విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్​ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలు తెలుసుకున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్​లో ‘నాడు- నేడు’ పేరిట పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నాడు- నేడుకు సంబంధించి పెండింగ్​ పనులన్నీ పూర్తిచేయాలని జగన్​ ఆదేశించారు.

Also Read: ‘సెకండ్​వేవ్’​ ముప్పు ఇంకా ఉంది.. కేంద్రం వార్నింగ్​

ఈ నెల 15 నుంచి ఆగస్టు 15 వరకు వర్క్​ బుక్స్​పై ఉపాధ్యాయులకు శిక్షణ ఉంటుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​ తెలిపారు. ఇంటర్​ విద్యార్థులకు 70 శాతం ఇంటర్​ ప్రథమ సంవత్సరం మార్కులు.. పదో తరగతి నుంచి 30 శాతం మార్కులు కేటాయిస్తామన్నారు. ఈ నెలాఖరుల లోపు ఇంటర్​ విద్యార్థులకు మార్కుల మెమోలు జారీ చేస్తామని చెప్పారు.

12 నుంచి జూనియర్​ కళశాలలు ఓపెన్​..
ఈ నెల 12 నుంచి జూనియర్​ కళాశాలలు ఓపెన్​ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రెండో ఏడాది అకడమిక్​ కేలండర్​ను ఇంటర్​ విద్యామండలి విడుదల చేసింది. బోధన, బోధనేతర సిబ్బంది విధులకు హాజరుకావాలని సూచించింది. తరగతులను ఆన్​లైన్​లో నిర్వహించనున్నారు.

Also Read: ఇలా చేస్తే థర్డ్ వేవ్​ రాకపోవచ్చు.. !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -