Friday, April 26, 2024
- Advertisement -

పేర్లు బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌కుండా పోలీస‌లు ఎందుకు గోప్య‌త పాటిస్తున్నారు..

- Advertisement -

చట్టసభ సభ్యుడైన ఒక ఎమ్మెల్యే లేదా గౌరవనీయులైన ఒక మంత్రి కి సంబందించి అవినీతి బ‌య‌ట‌కు వ‌స్తే …… దానికి బాధ్యుడిను చేస్తూ విచారణ అధికారులు ఆయనకు నోటీసులు పంపుతారు. విచారణాధికారులు బహిరంగంగానే.. ప్రజాప్రతినిధుల పేర్లను వెల్లడించి… వారికి నోటీసులు పంపుతారు. అందులో దాపరికం ఎంతమాత్రమూ ఉండదు.
కాని ఇప్పుడు హైదరాబాదు నగరంలో సెలబ్రిటీల ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న డ్రగ్స్ వ్యవహారాన్ని గమనిస్తే… సినిమా సెలబ్రిటీలు లక్షల మంది ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు, చట్టసభల సభ్యులకంటె మహానుభావులా? గొప్పవాళ్లా? అన్న వార్త‌లు వినిపిస్తున్నాయి.నోటీసులు సర్వ్ చేసిన తర్వాత కూడా వారి పేర్లను మీడియాకు విడుదల చేయకుండా పోలీసులు ఎందుకు గోప్యత పాటిస్తున్నారో అనేది అర్థం కావ‌డంలేదు. వారివివరాలు బహిర్గతం కాకుండా కాపాడడానికి ఎందుకు తాపత్రయపడుతున్నారో అనేది ఆలోచించిల్సిన విష‌యం.
ఎంతో జనాదరణ ఉండే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన‌.. డ్రగ్స్ కేసు బయటపడిన తర్వాత.. రాష్ట్రంలో ప్రజలు, యువత ప్రధానంగా పనులన్నీ పక్కన పెట్టి దీని గురించే మాట్లాడుకునే విధంగా పోలీసులు ఎందుకు గోప్య‌త పాటిస్తున్నారు.
ఎమ్మెల్యేలు, మంత్రులు అయినా సరే లెక్కలేకుండా నోటీసులు ఇస్తే వివరాలు బయటపెట్టే పోలీసులు సినిమా సెలెబ్రిటీలను , డ్రగ్స్ దొంగల పరువును కాపాడడానికి ఎందుకు ప్రయత్నించాలి? వీరి తీరు చూస్తే 19నుంచి ప్రారంభం కానున్న విచారణను కూడా రహస్యంగా… ఎవ్వరికీ ఆ సమాచారం కూడా తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తారేమో అనికూడా అనుమానాలు కలుగుతున్నాయి.
నోటీసులు ఇచ్చిన‌వారిపేర్లు బయటపెట్టకుండా, మీడియాలో పిచ్చి పిచ్చి ఊహాగానాలకు ఆస్కారం ఇస్తూ వారు ఆడుతున్న దాగుడుమూతల మతలబే బోధపడడం లేదు. పోలీసులు తమ చిత్తశుద్ధిని మరింత స్పష్టంగా నిరూపించుకుంటే బాగుంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -