Tuesday, May 14, 2024
- Advertisement -

ఏపీ రాజధాని శంఖుస్థాపనకు మోడీ రారు.. రీజనేంటి?!

- Advertisement -

ఏపీ నూతన రాజధాని శంఖు స్థాపనను బ్రహ్మాండంగా చేయాలని డిసైడ్ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. రాష్ట్ర విభజన జరిగి ఏడాది అవుతున్న తరుణంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కొత్త రాజధానికి శంఖు స్థాపన చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.

ఇందుకు సంబంధించి ముహూర్తం ఖరారు అయ్యింది. ఆహ్వానితుల జాబితా కూడా తయారవుతోంది. అయితే ఈ జాబితాలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ లేరు.. ఎందుకలా.. అనేదాని వెనుకే చాలా రీజన్లు వినిపిస్తున్నాయి.

ఏపీ నూతన రాజధాని శంఖుస్థాపన అంటే..అది ఎంతటి ప్రతిష్టాత్మక కార్యక్రమమో వేరే చెప్పనక్కర్లేదు. ఏకంగా ఏపీలో సింగపూర్ కు నకలు లాంటి నగరాన్నే నిర్మింపజేస్తామని బాబు ప్రభుత్వం చెప్పుకొస్తోంది. ఇది షాంఘై స్థాయిలో.. సియోల్ లెవల్లో ఉంటుందని బాబు వంటి వారు చెబుతూ వస్తున్నారు. కాబట్టి అలాంటి నగర నిర్మాణానికి సంబంధించి పునాది రాయి వేయడం నిస్సందేహంగా ప్రతిష్టాత్మక కార్యక్రమమే.మరి ఇలంటి కార్యక్రమానికి కేంద్రం సహకారం ఎంత అవసరమో.. మోడీ వంటి వారు ఈ కార్యక్రమానికి హాజరు కావడం కూడా అంతే అవసరం!

ఈ కార్యక్రమానికి వచ్చి గుడ్ విష్ చెప్పి వెళితే..కేంద్రం నుంచి సహకారం ఉంటుందని స్పష్టం అవుతుంది. అయితే ప్రస్తుతానికి ఉన్న సమచారాన్ని బట్టి చూస్తే.. ఏపీ రాజధాని శంఖుస్థాపనకు మోడీ వచ్చే అవకాశాలు కనపడటం లేదు. ఏపీకి బ్రహ్మాండమైన రాజధానిని కట్టించి ఇస్తామని ఎన్నికల సమయంలో చెప్పి వెళ్లిన ఆయన కు ఇప్పుడు శంఖుస్థాపనకు కూడా రావడం లేదు. ఈ రాజధాని వ్యవహారం లో భూముల తతంగం.. రైతుల ఆక్రోశాలు కూడా ఉన్నాయి. దీంతోనే మోడీ ఈ రాజధాని వ్యవహారంలో జోక్యం చేసుకోదలచలేదని.. శంఖు స్థాపనకు హాజరు కాకపోవడానికి కూడా ఇదే రీజన్ అని తెలుస్తోంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి పీఎంవో సమాచారం ఇచ్చిందని.. అందుకే మోడీ కి అసలు ఏపీ ప్రభుత్వం ఆహ్వానం అందించలేదని ప్రచారం జరుగుతోంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -