Tuesday, April 30, 2024
- Advertisement -

నంద‌మూరి కుటుంబంనుంచి భాబుకు షాక్ త‌గ‌ల‌నుందా..

- Advertisement -
Why NTR Family not attend TDP Mahanadu 2017 at Visakhapatnam

విశాఖ‌లోమ‌హానాడును టీడీపీ అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హిస్తోంది.ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు …చేప‌ట్ట‌బోయే కార్య‌క్ర‌మాల‌గురింది వేదిక‌పై అంద‌రూ ఊద‌ర‌గొట్టారు.పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు దిశానిర్దేశం చేశారు.

అయితే ఈ మ‌హానాడుకు నంద‌మూరి కుటుంబం దూరంగా ఉండ‌టంపై రాజ‌కీయాల్లో తీవ్ర చ‌ర్చ జ‌రుగుతోంది.దీనికి తోడు బాబును నంద‌మూరి కుటుంబం బ‌హిరంగంగానే విమ‌ర్శించారు.
చాలా కాలంగా చంద్రబాబుకి, టీడీపీకి.. హరికృష్ణ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తన రాజ్యసభ సభ్యత్వం పొడిగింపునకు చంద్రబాబు నిరాకరించడం, దీనికి తోడు జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెట్టడం.. హరికృష్ణను బాధించాయి. దీంతో చంద్రబాబు, హరికృష్ణల మధ్య సంబంధాలు దాదాపుగా తెగిపోయాయని చెబుతారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుని టార్గెట్ చేస్తూ హరికృష్ణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

{loadmodule mod_custom,Side Ad 1}

టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు పథకాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పథకాలనే అందరు కాపీ కొట్టారని వాటికి కొత్త పథకాలని కలరింగ్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.కాగా హరికృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేకెత్తించిన సమయంలోనే ఆయన సోదరి అయిన పురంధేశ్వరి సైతం ఇదే తరహా కామెంట్లు చేశారు.ప్రజా సంక్షేమం కోసం నిరంతరం తపించిన మహామనిషి దివంగత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ప్రస్తుతం కూడా ఎన్టీఆర్ పథకాలే కొనసాగుతున్నాయని చెప్పారు.
ఇక దివంగత ఎన్టీ రామారావు సతీమణి లక్ష్మీ పార్వతి సైతం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. టీడీపీ తెలంగాణలో చచ్చిపోయిందని, ఏపీలో ఉన్నా లేనట్టేనని ఆమె వ్యాఖ్యానించారు. పేద ప్రజల కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేసిన లక్ష్మీ పార్వతి.. ఎన్టీఆర్ హయాంలో నిర్వహించే ప్రతి మహానాడు పేదవాళ్లకు ఉపయోగపడేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.

{loadmodule mod_custom,Side Ad 2}

విశాఖ‌లో అట్ట‌హాసంగా జ‌రుగుతున్న మ‌హానాడుకు క‌నీసీం నంద‌మూరి కుటుంబంనుంచి ఒక్క‌రు కూడా హాజ‌రుకాక‌పోవ‌డం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. వీట‌న్నింటిని చూస్తె భ‌విష్య‌త్తులో బాబుకు నంద‌మూరి కుంటుంబం భారీ షాక్ ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}z4xsB33ftHc{/youtube}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -