Friday, May 3, 2024
- Advertisement -

జీమెయిల్ సేవలు.. యూట్యూబ్ ఆగిపోయినయ్.. కారణం అదేనా?

- Advertisement -

ప్రపంచం మొత్తం కొద్ది సమయం అయోమయంలో పడింది. ప్రతి ఒక్కరూ వీక్షించే యూట్యూబ్ ఛానల్ ఒక్కసారిగా ఆగిపోయాయి.. అంటే దాదాపు ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు యూట్యూబ్ ద్వారా ఆన్‌లైన్ వీడియో ఆధారిత సేవలకు విఘాతం కలిగింది. కొద్ది గంటల నుంచి యూట్యూబ్‌లో ఆన్‌లైన్‌లో వీడియోలు చూడడానికి సాంకేతిక సమస్యలు తలెత్తినట్లుగా కనిపిస్తుంది. దీంతో YouTube యూజర్లు గందరగోళానికి గురయ్యారు.

తమ మెయిల్‌‌లు పనిచేయడం లేదంటూ పలువురు నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ఆ సంస్థను ట్యాగ్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. భారతదేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఈ ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. మెయిల్ పంపుకోవడం, వచ్చినవి చూడటం సహా ఇతర చర్యల్లో ఈ ఇబ్బంది తలెత్తిందని వారు కామెంట్లు పెడుతున్నారు.

యూట్యూబ్ లోను సాంకేతిక సమస్య తలెత్తినట్లుగా తెలుస్తుంది. యూట్యూబ్ సేవలు నిలిచిపోవడం యూజర్లను కంగారు పెట్టేస్తుంది. యూట్యూబ్‌లో ఎలాంటి వీడియోలు అప్‌లోడ్ కావడం లేదు. ఏమైందో తెలియడం లేదు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దింతో ప్రస్తుతం #YouTubeDOWN ట్రెండ్ అవుతుంది. అయితే గూగుల్ ఈ సమస్యపై ఇంతవరకు స్పందించలేదు. మరోవైపు దీనిపై గూగుల్ అధికారులు సేవలు పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -