Saturday, May 4, 2024
- Advertisement -

గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌సి జ‌గ‌న్‌…

- Advertisement -

ఏపీ కాబోయే సీఎం, వైసీపీ అధినేత జగన్ కొద్దిసేపటి క్రితం గ‌వ‌ర్న‌ర్ తో భేటీ అయ్యారు. ఉదయం తాడేపల్లిలో ఎల్పీనేతగా జగన్ ను ఎన్నుకున్న కాపీని గవర్నర్ కు అందచేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమను ఆహ్వానించాలంటూ జగన్ గవర్నర్ ను కోరారు. కాగా, జగన్ వెంట రాజ్ భవన్ కు వచ్చినవారిలో బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఆదిమూలపు సురేశ్ తదితరులున్నారు. గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసిన అనంత‌రం సాయంత్రం తెలంగాణా సీఎం కేసీఆర్‌ను క‌ల‌సి ప్ర‌మాణ‌స్వీకారానికి ఆహ్వానించ‌నున్నారు. అనంత‌రం జగన్ రేపు ఉదయం ఢిల్లీ బయలుదేరనున్నారు. మధ్యాహ్నం ప్రధాని నరేంద్రమోడీని మర్యాదపూర్వకంగా కలుస్తారు

ఉద‌యం తాడేప‌ల్లిలోని నివాసంలో వైఎస్ఆర్‌సీపీ ఎల్పీ భేటీ అనంత‌రం జ‌గ‌న్ ప్ర‌త్యేక విమానంలో హైద‌రాబాద్ బేగంపేట విమానాశ్ర‌యం చేర‌కున్నారు. అక్క‌డి నుంచి భారీ కాన్వ‌య్‌తో రాజ్‌భ‌న్‌కు చేరుకొని గ‌వ‌ర్న‌ర్‌తో భేటీ అయ్యారు.

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించిన అనంతరం తొలిసారి హైదరాబాద్‌ వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. వైఎస్‌ జగన్‌ను అభినందిస్తూ నగరంలో పలుచోట్ల భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే లోటస్‌పాండ్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -