- Advertisement -

పాద‌యాత్ర‌కు విరామం…కోర్టుకు హాజ‌ర‌యిన జ‌గ‌న్‌..

- Advertisement -

అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా వైకాపా అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. దీంతో పాద‌యాత్ర‌కు ఒక రోజు విరామం ఇచ్చారు. జ‌గ‌న్తోపాటు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇండియా సిమెంట్స్‌ అధినేత శ్రీనివాసన్‌ విచారణకు హాజరయ్యారు.

జ‌గ‌న్ మొద‌లు పెట్టిన పాద‌యాత్ర దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం పాద‌యాత్ర కడప జిల్లా ఎర్రగుంట్లకు చేరింది. ప్ర‌తీ శుక్ర‌వారం కేసుల విష‌యంలో సీబీఐ కోర్టుకు హాజరుకావాల్సి ఉండటంతో యాత్రకు విరామం ప్రకటించినట్లు వైకాపా శ్రేణులు తెలిపాయి. శాసనసభ సమావేశాలను వైకాపా బహిష్కరించడంతో ప్రతిపక్షం లేకుండానే ఉభయ సభ సమావేశాలు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -