Tuesday, May 7, 2024
- Advertisement -

జ్యోతి, పరిటాల వర్గాలకు కోర్ట్ చీవాట్లు…. వైకాపా నేతకు 11 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం

- Advertisement -

నోరుంది కదా అని ఒకరు రెచ్చిపోయారు…….మీడియా చేతిలో ఉంది కదా అని మరొకరు ఇష్టారీతిన బురదచల్లారు.అబద్ధాలు, అభూత కల్పనలతో జగన్‌కి నష్టం చేయాలని చూశారు. ఇప్పుడు ఇద్దరూ కూడా అడ్డంగా బుక్కయ్యారు. ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ, పరిటాల సునీత వర్గం వైకాపా నేత ప్రకాష్ రెడ్డికి 11లక్షల రూపాయల పరువు నష్ట పరిహారం చెల్లించాలని కోర్ట్ ఆదేశించింది. పరిటాల సునీత దగ్గరి బంధువు నారాయణ చౌదరి, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలు వైకాపా నేత ప్రకాష్‌రెడ్డికి ఈ నష్టపరిహారం చెల్లించాలని కోర్ట్ ఆదేశించింది. పరిటాల రవిపై జరిగిన కారు బాంబ్ దాడి కేసులో వైకాపా నేత ప్రకాష్ రెడ్డికి సంబంధం ఉందని రెచ్చిపోయి మాట్లాడిన నేతలకు, పిచ్చి పిచ్చిగా వార్తలు రాసిన మీడియా సంస్థకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది కోర్ట్. చివాట్లు పెట్టింది. కోర్ట్ తీర్పుతో అస్తమానం నీతులే చెప్తాం అని చెప్పుకునే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అసలు వ్యవహారాలు పూర్తిగా బయటపడ్డాయి.

పరిటాల రవిపై దాడులు, పరిటాల రవి హత్య విషయాల్లో వైఎస్ జగన్‌ని టార్గెట్ చేస్తూ పచ్చ బ్యాచ్ మొత్తం చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ ప్రకాష్‌రెడ్డి కూడా వైఎస్ జగన్‌కి సన్నిహితుడే. ఇంకా జగన్ సన్నిహితులైన చాలా మందిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. దేశం మొత్తం తిరుగుతూ వైఎస్‌లపై ఫ్యాక్షనిస్ట్‌లు అన్న ముద్ర వేయాలని చాలా ప్రయత్నం చేశారు.

కట్ చేస్తే పరిటాల రవి హత్యలో ప్రధాన నిందితుడు అని చెప్పిన జేసీ దివాకరరెడ్డిని మాత్రం అధికారం కోసం పార్టీలో చేర్చుకున్నారు. ఆనాడు జేసీ నర హంతకుడు, పరిటాల రవిని హత్య చేయడంలో జేసీకి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్‌లు సాయం చేశారు అని రెచ్చిపోయిన పరిటాల సునీత, చంద్రబాబు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలు ఇప్పుడు జేసీలను పొగిడే పనిలో ఉన్నాయి. ఆంధ్రజ్యోతి మీడియాలో అయితే జేసీల మంచితనం గురించి తరచుగా వార్తలు వండుతూనే ఉన్నారు. పచ్చ నీతి అంటే ఇలానే ఉంటుందేమో. ఇక 2014 ముందు వరకూ కూడా పరిటాల రవి ప్రతి వర్థంతి కార్యక్రమాన్ని భారీగా నిర్వహిస్తూ …..అన్ని సందర్భాల్లోనూ వైఎస్ జగన్‌ని తీవ్రస్థాయిలో విమర్శించిన పరిటాల సునీత రీసెంట్‌గా జరిగిన పరిటాల వర్థంతి కార్యక్రమంలో మాత్రం ఏమీ మాట్లాడలేదు. 2014జేసీ దివాకరరెడ్డి టిడిపిలో చేరిన నాటి నుంచీ ఇదే పరిస్థితి. పరిటాల రవి హత్యలో ప్రధాన నిందితుడు జేసీ అని నాడు విమర్శించిన విమర్శలు నేడు ఏమయ్యాయ్? పరిటాల రవిని జేసీనే చంపించాడు అని నాడు చెప్పినవి అబద్ధాలా? లేకపోతే అధికారం కోసం పరిటాల రవిని చంపినవాళ్ళతో కూడా కలిసిపోయారా?

ఏది ఏమైనా తాజాగా కోర్ట్ ఇచ్చిన తీర్పు మాత్రం అబద్ధపు రాతలు రాసే మీడియాకు, రాజకీయ లబ్ది కోసం సొంత కుటుంబ సభ్యునిపై బాంబ్ దాడి, హత్య ఉదంతాలను కూడా వాడుకున్నవాళ్ళకు చెంప పెట్టు లాంటిదే. కోర్ట్ చివాట్లు, తీర్పు తర్వాత అయినా పచ్చ మీడియా సంస్థకు, అబద్ధపు రాతలు రాసిన వాళ్ళు తీరు మార్చుకుంటారేమో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -