Thursday, April 18, 2024
- Advertisement -

షర్మిలా ను కలసిన రోజా.. ఎందుకు?

- Advertisement -

ఏపిలో ఇప్పుడు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. మొన్నటి వరకు పోలవరం ప్రాజెక్టు పై అధికార పార్టీ, ప్రతిపక్ష నేతల మద్య మాటల యుద్దం నడిచిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల పోలవరం ఆగిపోయిందని.. ప్రజలకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కారని.. అందుకే టీడీపీ మర్చిపోలేని బుద్ది చెప్పారని అధికార పార్టీ నేతలు విరుచుకు పడుతున్నారు. మరోవైపు తమకు ఏ మాత్రం ఛాన్సు దొరికినా వైసీపీని టార్గెట్ చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇక మద్యలో బీజేపీ నేతల విషయం ప్రత్యేకం చెప్పనక్కరలేదు.. ఏపిలో ఆ పార్టీ బలంగా ఎదగాలని నానా తంటాలు పడుతున్నారు.

తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిలతో వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా సమావేశం అయ్యారు. రాజకీయంగానే కాకుండా సీఎం వైఎస్ జగన్ కి ఎమ్మెల్యే రోజా అంటే ఒక సోదరిగా ప్రత్యేక అభిమానం. రాఖీ పండుగ సందర్భంగా ఆమె తప్పకుండా జగన్ ని కలిసి కాఖీ కడుతుంది. తన చెల్లెలు షర్మిల అంటే ఎంత గౌరవం ఇస్తారో రోజా అన్నా కూడా అంతే గౌరవం ఇస్తారు వైఎస్ జగన్. తాజాగా షర్మిలతో కలిసి దిగిన ఫోటోలు రోజా షేర్ చేయడంతో వీరి సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు అది కేవలం సాధారణ సమావేశమేనని, అందులో ఎలాంటి రాజకీయాలు లేవని రోజా అనుచరులు చెబుతున్నారు. నవంబర్ 16న రోజా పుట్టిన రోజు. ఆ రోజు సీఎం వైఎస్ జగన్‌ను కలసిన రోజా ఆశీస్సులు తీసుకున్నారు. అయితే విజయమ్మ, షర్మిలతో ఎమ్మెల్యే రోజా అప్పుడప్పుడు టచ్ లో ఉంటారని  ఓ కుటుంబసభ్యురాలిగా కలసిపోతారని పార్టీ వర్గాల్లో టాక్. అయితే షర్మిలను కలిసిన రోజా ఏపీలో తాజా రాజకీయపరిణామాలపై కూడా చర్చించి ఉండొచ్చని భావిస్తున్నారు. 

గ్రేటర్ ఫైట్.. బడా నేతల హల్ చల్!

దుబ్బాకలో బీజేపి గేలుపు కాదా..? హరీష్ రావుపై అదిష్టానం గేలుపేనా..?

దటీజ్ జగన్ స్టైల్.. నమ్మిన మనిషికే పట్టం కడతారా?

కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ మార్క్ ప్లాన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -