Friday, April 19, 2024
- Advertisement -

గ్రేటర్ ఫైట్.. బడా నేతల హల్ చల్!

- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అన్ని పార్టీల నేతలు తమ జోరు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ తరుపున రేవంత్, ఉత్తమ్ కుమార్ బిజీ బిజీగా ప్రచారాల్లో మునిగిపోయారు. ఇక అధికార పార్టీ తరుపు నుంచి మంత్రి కేటీఆర్ విసృతంగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు  కమలం మరింత పట్టు బిగుస్తోంది. ఈసారి మేయర్ పీఠం దక్కించుకోవాలని టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ జోరుమీద ఉన్నారు. మరోవైపు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు అందరూ నగరానికి ‘క్యూ’ కడుతున్నారు.

ఇప్పటికే కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, స్మృతి ఇరానీ ఇప్పటికే పర్యటించి వెళ్లారు.  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ప్రచారానికి రానున్నారు. కాగా, ఆయన పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నాగోల్ రోడ్‌షోలో ఆయన పాల్గొంటారు. ఈ నెల 29 న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా నగరానికి రానున్నారు.  అంతే కాదు యూపీ సీఎం, ఫైర్‌బ్రాండ్ యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం జరిగే ప్రచారంలో పాల్గొననున్నారు. 

ఇవన్నీ ఒక ఎత్తైతే  ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కూడా ఖరారైంది. 29 న మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. అయితే ఆయన ప్రత్యేకంగా ప్రచారానికి కాకుండా భారత్ బయోటెక్‌లో కరోనా వ్యాక్సిన్ పురోగతిని ప్రధాని పరిశీలించనున్నారు. ఏది ఏమైనా ఈ ఎన్నికలు అసెంబ్లీ పోరు కన్నా మరింత ఉత్కంఠంగా మారిపోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

వామ్మో.. పుష్ప లో తోమ్మిది మంది విలన్స్ అంటా..?

ఆచార్య షూటింగులో రామ్ చరణ్ ఎప్పుడంటే..?

మహేష్ బాబు సీక్రెట్స్ బయటపెట్టిన మంజుల..

అవును మేమిద్దరం డేటింగ్ లో ఉన్నాం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -