Monday, May 6, 2024
- Advertisement -

కశ్మీర్ బిల్లులో ఏపీ.. భగ్గుమన్న వైసీపీ

- Advertisement -

రాజ్యసభలో ఆమోదం పొందిన కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దు బిల్లు మంగళవారం లోక్ సభలో చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా అమిత్ షా పీవీకే, సియాచిన్ మనదేనంటూ ఘర్జించాడు. ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని ప్రకటించాడు.

దీనిపై సభలో మాట్లాడిన కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఆసక్తికర వ్యాఖ్యలు చేవారు. కశ్మీర్ ను విభజించడానికి ముందుగా ఆ రాష్ట్ర అసెంబ్లీ అనుమతి తీసుకోవాలని.. ఇది చేయలేదని దుయ్యబట్టారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఏపీ విభజన సమయంలో ఆ రాష్ట్ర అసెంబ్లీని సంప్రదించి అభిప్రాయం తెలుసుకున్నామన్నారు.

అయితే మనీష్ తివారీ ఈ డైలాగ్ అనగానే వైసీపీ ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఏపీ విభజన సయమంలో ఈ నియమాన్ని నాడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు పాటించలేదంటూ వైసీపీ సభ్యులు నిలదీశారు. దీంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. ఏపీ అసెంబ్లీకి తాము బిల్లు పంపించామని కాంగ్రెస్ ఎంపీ మనీష్ చెప్పినా వైసీపీ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ కు కశ్మీర్ పై మాట్లాడే హక్కు లేదని వైసీపీ నేతలు హితవు పలికారు.

ఈ విషయంపై మాట్లాడిన వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామ రాజు.. సీఎం కిరణ్ విబజనను వ్యతిరేకించారని.. పార్టీకి, పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. ఏపీ అసెంబ్లీ విభజన బిల్లును తిరస్కరించి కేంద్రానికి పంపిందని అయినా కాంగ్రెస్ పార్టీ విభజించారని విమర్శించారు. ఇక జమ్ముకశ్మీర్ బిల్లుకు తమ పూర్తి మద్దతును లోక్ సభలో వైసీపీ ప్రకటించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -