- Advertisement -

అవినీతిపరులపై సర్కారు నజర్

- Advertisement -

GHMC టౌన్‌ప్లానింగ్‌ విభాగంలోని అవినీతిపై తెలంగాణసర్కారుదృష్టిసారించింది. ఇటీవలి కాలంలో టౌన్ ప్లానింగ్ విభాగంపైఅనేకఅవినీతిఆరోపణలువస్తున్నాయి. ఏ ఫైలు కదలాలన్నా.. పైసలు ముట్టజెప్పక తప్పని దుస్థితి ఈ విభాగంలో నెలకొంది. ఇటీవల ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాల అమల్లోనూ భారీగా అవినీతి జరిగిందని సర్కారు దృష్టికి వచ్చింది.

ఈనేపథ్యంలో  ఈ విభాగంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. వీరిపై  ఏసీబీతో దాడులు చేయించాలని సర్కారు నిర్ణయించింది. దీంతోపాటే.. ఏళ్ల తరబడి బదిలీలు లేకుండా ఒకే సీట్లో పాతుకు పోయిన వారి వల్ల కూడా అవినీతి అధికంగా జరుగుతోందని ప్రభుత్వం గుర్తించింది. దీంతో దిగువ స్థాయి ఉద్యోగులను తక్షణమే బదిలీ చేయాలని నిర్ణయించింది. దీంతోపాటే.. అక్రమాలకు మరో కారణమైన కాంట్రాక్టు ఉద్యోగులను ఇతర విభాగాలకు మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -