Saturday, May 4, 2024
- Advertisement -

ఉత్త‌రాంధ్ర స‌ర్వే రిపోర్ట్… అయోమ‌యంలో బాబు..

- Advertisement -

ఎన్నికలు దగ్గర పడే కొద్దీ సర్వేలు ఆ పార్టీలు చేసుకోవడం సహజం . అయితే ఈ సర్వే స్వయంగా టీడీపీ చేయించుకున్నది అయితే ఈ సర్వే లో ఖంగుతినే రిజల్ట్ వచ్చింది టీడీపీకీ. ఈ ఫ‌లితాల‌ను చూసిన బాబుకు నిద్ర‌ప‌ట్ట‌డంలేదంట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి కార‌ణం పాద‌యాత్ర‌కు వ‌స్తున్న ప్ర‌జాద‌ర‌ణ‌.

జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో జ‌నం ఉప్పెన‌లా క‌ద‌ల‌డంతో టీడీపీనేత‌ల్లో వ‌ణుకు పుడుతోంది. తితిలీ తుపాను తర్వాత, బాధిత ప్రాంతాల్లో పర్యటించేందుకు ప్రతిపక్ష నేత రాకపోవడమేంటని అధికార పక్షం ప్రశ్నిస్తూ వస్తోన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో జగన్‌ పాదయాత్ర పలచగా సాగుతుందని టీడీపీ వేసిన అంచనా రివ‌ర్స్ అయింది.

ఇక రెండు నెలల క్రితం శ్రీకాకుళం జిల్లాలో పర్యాటించిన సమయంలో జిల్లా మొత్తం జగన్ వెనుక నడిచింది. తెలుగుదేశం పార్టీకి శ్రీకాకుళం జిల్లాలో ఆదరణ తగ్గిపోయిందని – రాజకీయ విశ్లేషకులు ఓ అంచానాకు వచ్చారు. జగన్ పర్యాటన తర్వాత జిల్లాను తితిలి తుఫాను కుదిపేసింది. స‌ర్వం కోల్పోయి ప్ర‌జ‌లు రోడ్డున ప‌డ్డారు. తిన‌డానికి తిండిలేక ప్ర‌భుత్వం కూడా స‌రైన రీతిలో స్పందించ‌క‌పోవ‌డంతో ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డ్డారు.

ప్రతిపక్షా పార్టీ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు – నాయకులు – కార్యకర్తలు తుఫాను బాధితులకు చేసిన సేవ సిక్కోలు వాసులను మరింత జగన్ అభిమానులుగా మార్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. మ‌రో వైపు శ్రీకాకుంల జిల్లాలోనే 50 రోజులు ఉంటాన‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించారు.

బస్సుల మీద ‘తితిలీ తుపానుపై విజయం సాధించిన చంద్రబాబు..’ అంటూ ప్రచారం , చెక్కుల‌పై బాబు పోటో ముద్రించి న‌వ్వుల‌పాల‌య్యింది టీడీపీ. జిల్లా ప్ర‌జ‌లు తమ ఆవేదనని జగన్‌ వద్ద మొరపెట్టుకొనేందుకు సిద్ధంగా ఉన్నారు. పాద‌యాత్రను అడ్డు కొనేందుకు టీడీపీ ఏర్పాట్లు చేసుకుంటోంది.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు జన ప్రవాహాన్ని ఏ జిల్లాలోనూ టీడీపీ అడ్డుకోలేకపోయింది. అధికార పార్టీ ఎన్ని కుట్ర‌లు చేసినా ప్ర‌జ‌లు మాత్రం జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు పోటెత్తారు. ఈ జిల్లాలోనే పాద‌యాత్ర ముగియ‌నుండ‌టంతో జిల్లా ప్ర‌జ‌లు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. జ‌గ‌న్ కు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొనేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారు. ఈ ప‌రిణామాల‌న్నింటినీ చూస్తూ ఉత్త‌రాంధ్ర జిల్లాల ప్ర‌జ‌లు జ‌గ‌న్ వైపే నిలిచార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -