Tuesday, May 14, 2024
- Advertisement -

అధికారంలో ఉంటె కొంటాం.. ప్ర‌తిప‌క్షంలో ఉంటె అమ్ముతాం

- Advertisement -

గ‌వ‌ర్న‌మెంట్ ఉంద్యోగం అంటేనే గ‌లీజ్ అయిపోయింద‌బ్బా…అనే డైలాగ్ చ‌త్ర‌ప‌తి సినిమాలో పాపుల‌ర్ అయితే..ప్ర‌స్తుతం రాజ‌కీయీలంటేనే గ‌లీజు వ్య‌భిచారం అయిపోయింద‌నె డైలాగ్‌లు ఇప్పుడు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. నీతులు చెప్పే నాయ‌కులు త‌మ పార్టీ అధికారంలో లేక‌పోతె ఒక్క క్ష‌నం కూడా పార్టీలో కొన‌సాగ‌డంలేరు. అప్ప‌టిక‌ప్పుడు అధికారంలో ఉన్న పార్టీల్లో చేరిపోతున్నారు. ఇప్పుడు టీడీపీ ప‌రిస్థితి కూడ అలానె ఉంది.

ఇటీవ‌లి జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవ‌డంతో నేత‌లు త‌మ దారులు తాము వెతుక్కుంటున్నారు. తాజాగా న‌లుగురు టీడీపీ రాజ్య‌స‌భ్యులు భాజాపాలో చేరారు. రాజ్యసభలో బీజేపీలోకి టీడీపీ విలీన ప్ర‌క్రియ కూడా పూర్త‌య్యింది. ఇప్పుడు వారు భాజాపా స‌భ్యులుగా కొన‌సాగ‌నున్నారు. ఇదంతా బాబు స్వ‌త‌హాగా చేసుకున్న‌దే. చెడ‌ప‌కురా చెడేవు అన్న సామెత బాబ‌కు అతికిన‌ట్లు స‌రిపోతుంది.

టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు య‌దేచ్చ‌గా పార్టీ ఫిరాయంపుల‌ను ప్రోత్స‌హించారు బాబు. వైసీపీ నుంచి గెలిచి 23 మంది ఎమ్మెల్యేల‌ను ముగ్గురు ఎంపీల‌ను టీడీపీలో చేర్చుకున్నారు. కాంట్రాక్టులు, డ‌బ్బులు, మంత్రి ప‌ద‌వులు ఎర‌చూపి ఫిరాయింపుల‌ను య‌దేచ్చ‌గా ప్రోత్స‌హించారు. అంత‌ టితో ఊరుకున్నాడా ఫిరాయింపు నేత‌ల‌లో ఐదుగురికి మంత్రి ప‌ద‌వులు కూడా క‌ట్ట‌బెట్టారు. తీరా సీన్ క‌ట్ చేస్తే బాబు ప‌రిస్థితి రివ‌ర్స్ అయ్యింది. పార్టీ నుంచి నేత‌లు ఒక్కొక్క‌రే వెల్లిపోతున్నారు. నలుగురు రాజ్య‌స‌భ్యులు భాజాపాలోకి వెల్లి 24 గంట‌లు గ‌డ‌వ‌క‌ముందే మ‌రో 15 మంది ఎమ్మెల్యేలు భాజాపాలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. అధికారంలో ఉంటె ఇర‌త పార్టీల నేత‌ల‌ను కొన‌డం..అధికారంలో లేకుండా ఇత‌ర పార్టీల‌కు త‌మ ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను అమ్మ‌డం బాబుకే అల‌వాటేన‌ని సోష‌ల్ మీడియాలో సెటైర్లు ప‌డుతున్నాయి.

తీరా సీన్ క‌ట్ చేస్తే బాబు ప‌రిస్థితి రివ‌ర్స్ అయ్యింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -