- Advertisement -

శ్రీరెడ్డి వెనుకో.. మరో రెడ్డి వెనుకో ఉండాల్సిన అవ‌స‌రం మాకు లేదు….

- Advertisement -

సినీ ఇండ‌స్ట్రీకే ప‌రిమిత‌న మైన వ్య‌వ‌హారం ఇప్పుడు రాజ‌కీయ రంగు పులుముకోంటోంది. శ్రీరెడ్డి-తమన్నా ఆడియో టేప్‌పై వైసీపీ పేరు బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు రాజ‌కీయాలు హాట్‌గా మారాయి. దీనిపై వైసీపీ నేత అంబ‌టి రాంబాబు స్పందించారు.

శ్రీరెడ్డి వెనుక వైసీపీ లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఎవరి వెనుకో ఉండి రాజకీయం చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. మాట్లాడాల్సింది సూటిగా ఘాటుగా మాట్లాడతాని అన్నారు అంబటి. రాష్ట్రంలో ఎవరు ఏం చేసినా వారి వెనుక వైసీపీ ఉందంటే ఎలా? అంటూ ఆయన ప్రశ్నించారు.

శ్రీరెడ్డి వెనుకో..మరో రెడ్డి వెనుకో ఉండాల్సిన అవసరం వైసీపీకి లేదని అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోరాటాల నుంచి పుట్టిన పార్టీ వైసీపీ అని, ఏదైనా మాట్లాడదలచుకుంటే సూటిగా, ఘాటుగా మేమే మాట్లాడతాము తప్ప, ఎవరి వెనుక ఉండాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. ఎవరు ఏం చేసినా దాని వెనుక వైసీపీ ఉందంటూ కొందరు కుట్ర చేస్తున్నారని అంబటి విమర్శించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -