ఓవైపు ఎన్నికల షెడ్యూల్ విడుదలతో సమరానికి రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే అభ్యర్తుల ఎంపికపై ఒ అంచనాకు వచ్చిన అన్నిపార్టీలు అభ్యర్తులను ప్రకటించేందుకు మూహూర్తం చూసుకుంటున్నారు. ఇదలా ఉంటే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జాతీయ సర్వేల ఫలితాలు కలకలం సృష్టిస్తున్నాయి. రెండు సర్వేల్లో కూడా భిన్నమైన ఫలితాలు రావడంతో ఏది కరెక్టో నిర్ణయించుకోలేని స్థితిలో ప్రజలు, రాజకీయ పార్టీలు ఉన్నాయి.
సీ ఓటర్ సర్వే తన ఫలితాలను వెల్లడించింది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ విషయంలో ఈ సర్వే ఫలితాలు సీఎం కుర్చీపై ఆశలు పెట్టుకున్న జగన్‌కు షాక్ ఇచ్చాయనే చెప్పాలి. ఇప్పటి వరకు వైసీపీదే గెలుపు అని చెప్పిన సర్వేలు టీడీపీది పైచేయి అని చెప్పలేదు. కాని ఇప్పుడు మాత్రం టీడీపీనే పైచేయి అని చెప్పడం రాజకీయా వర్గాల్లో మరింత ఆసక్తిని పెంచుతోది. సీ ఓటర్ సర్వేలో టీడీపీకి 14 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకుంటుందని, వైసీపీ 11 ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని ఈ సర్వే చెబుతోంది. దీన్ని బట్టి చూస్తె టీడీపీనే మరో సారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది.
అయితే ఇండియా టీవీ-సీఎన్ ఎక్స్ సర్వే మాత్రం సీ ఓటర్ సర్వే ఫలితాలకు వ్యతిరేకంగా ఫలితాలను విడుదళ చేసింది. ఈ సర్వే ఫలితాల్లో వైసీపీలో ప్రభంజనం కొనసాగుతుందని చెప్పింది. ప్రస్తుతం విపక్ష హోదాలో ఉన్న వైసీపీ స్టన్నింగ్ విక్టరీని అందుకుంటుందని తేల్చేసింది. రాష్ట్రంలోని మొత్తం 25 స్థానాల్లో వైఎస్సార్సీపీ 22 చోట్ల, టీడీపీ 3 స్థానాల్లో విజయం సాధిస్తాయని ఇండియా టీవీ–సీఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్స్ పేర్కొంది. దీన్ని బట్టి చూస్తె ఈసారి ఏపీ సీఎంగా జగన్ పదవీ బాధ్యతలు చేపట్టడం ఖాయమేనని తేల్చేసింది. అయితే సర్వేల్లో ఏది నిజమో..ఏది అబద్దమో తెలియక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు.
