Sunday, May 12, 2024
- Advertisement -

‘నువ్వు 2002లో గుజరాత్ సీఎమ్ అయితే..నేను 1995లోనే సీఎం అయ్యా…

- Advertisement -

జ‌గ‌న్‌పై దాడి, రాష్ట్రంలో ఐటీ దాడుల నేప‌థ్యంలో సీఎం చంద్ర‌బాబు నాయుడు హ‌టాత్తుగా ఢిల్లీ వెల్లారు. అక్క‌డ జాతీయ నాయ‌కులతో బిజీ బిజీగా గ‌డిపారు. న‌న్ను త‌క్కువ అంచ‌నా వేయ‌వ‌ద్ద‌ని చెప్పిన బాబు ప్ర‌సెమీట్‌లో మాత్రం పాత‌చింత కాయ ప‌చ్చ‌డిలాగానే మాట్లాడారు.

ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మ‌రో సారి కేంద్రంపై ఆరోప‌నలు చేశారు. 2014లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ప్ర‌క‌టించార‌ని దాన్ని భాజాపా తుంగ‌లోకి తొక్కింద‌న్నారు. విభజన హామీలు అమలు చేయాలనీ, ఏపీని ఆదుకోవాలని కోరుతూ తాను 29 సార్లు ఢిల్లీకి వచ్చానని చంద్రబాబు గుర్తుచేశారు.

ఎన్డీయే ప్రభుత్వంలో తాము కలిసి ఉన్నప్పటికీ, టీడీపీని దెబ్బతీసే ప్రయత్నాలు చేశారని తెలిపారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నేతలు తమను కాదని వైసీపీ నేతల సాయం తీసుకున్నారని విమర్శించారు. బీజేపీ-వైసీపీల మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆరోపించారు.అవినీతి, ఆర్థిక అవకతవకల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు తప్పించుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజల అభీష్టం మేరకు ఎన్టీయే కూటమి నుంచి తప్పుకున్నట్లు వెల్లడించారు.

‘నువ్వు 2002లో గుజరాత్ ముఖ్యమంత్రి అయితే.. నేను 1995లోనే సీఎం అయ్యా. నాకు పరిపక్వత లేదంటావా? దాని అర్థం ఏమిటంటూ నిల‌దీశారు. దేశంలో రెండో తరం ఆర్థిక సంస్కరణలను నేను అమ‌లు చేశాన‌ని అందుకే..హైద‌రాబాద్‌ను ప్ర‌పంచ ప‌టంలో నిలిపామ‌న్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -