Monday, May 6, 2024
- Advertisement -

ఏపీ ఇంటెలిజెన్స్ స‌ర్వే .. రిపోర్ట్ చూసి షాకైన చంద్ర‌బాబు

- Advertisement -

ఆ మ‌ధ్య వ‌రుస‌గా విడుద‌లైన జాతీయ స‌ర్వేల‌న్ని అధికారం వైఎస్ఆర్‌సీపీదే అని ఘంటాప‌థంగా చెప్పాయి. దీంతో అల‌ర్టైన చంద్ర‌బాబు.. వ‌రుస‌గా నాలుగున్న‌రేళ్ల క్రితం ఇచ్చిన ఎన్నిక‌ల హామీల‌ను అమ‌లు చేస్తానంటూ.. మ‌రికొన్ని హామీల‌ను ఇస్తూ రాష్ట్రంలో సుడిగాలి ప‌ర్య‌ట‌న చేశారు. దీంతో గాలి త‌న వైపుకు మ‌ళ్లీంద‌నుకున్న త‌ర్వాత… ఇప్పుడు స‌ర్వే చేయండంటూ ఓ జాతీయ ఛాన‌ల్‌కు, ఇంటెలిజెన్స్ బ్యూరోకు బాధ్య‌త‌ను అప్ప‌గించార‌ని టాక్‌.

ఇప్పుడు ఏపీ ఇంటెలిజెన్స్ బ్యూరో స‌ర్వే నివేదిక‌లు చంద్ర‌బాబు టెబుల్ మీద‌కు చేరాయ‌ని స‌మాచారం. వాటిని చూసి బాబుకు షాక్ కొట్టినంత ప‌నైంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే 175కు గాను 95 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైఎస్ఆర్‌సీపీ జెండా ఎగరేయ‌డం ఖాయ‌మ‌ని నివేదిక సారాంశం. టీడీపీ 48 సీట్ల‌కే ప‌రిమిత‌మ‌వుతోంద‌ని నివేదిక తెలిపింది. దీనిని బ‌ట్టి అధికారంలోకి చేప‌ట్టడానికి కావాల్సిన 88 సీట్ల కంటే 7 సీట్లు ఎక్కువ‌గానే వైఎస్ఆర్‌సీపీ సొంతం చేసుకుంటుంది. టీడీపీకి అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర‌వ‌డ‌మే దీనికి కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఇక రాయ‌ల‌సీమ‌లో వైఎస్ఆర్‌సీపీ క్లీన్ స్వీప్ చేస్తుంద‌ట‌.

ఇక అమ‌రావ‌తి ప‌రిస‌ర జిల్లాల్లో మాత్రం టీడీపీ ప్రభావం చూపనుంది. ఇక ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో మాత్రం జ‌న‌సేన అంతో ఇంతో ప్ర‌భావం చూపించే అవ‌కాశం క‌నిపిస్తుంది. కార‌ణం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ సామాజిక వ‌ర్గమైన‌ కాపు కుల‌స్తులు ఎక్కువ‌గా ఉండ‌ట‌మే కార‌ణం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -