Saturday, April 20, 2024
- Advertisement -

అన్నా రాంబాబుకి చేదు అనుభవం?

- Advertisement -

గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకి చేదు అనుభవం ఎదురైంది. నిన్న ప్రకాశం జిల్లా వైఎసార్సీపీ ప్రెసిడెంట్ బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డిలతో విడివిడిగా రాంబాబు సమావేశమయ్యారు. అయితే ఇద్దరి దగ్గర నుండి సానుకూల స్పందన రాలేదని సమాచారం.

ఈ ఇద్దరు సీనియర్ నాయకులు అన్నా రాంబాబుని ఆహ్వానించకపోయినా, అపాయింట్మెంట్ ఇవ్వకపోయినా ఆయనే వెళ్లి కలిసినట్టు సమాచారం. సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయట. గిద్దలూరు సీట్ ఇవ్వలేమని మీరు పార్టీ కోసం పని చేసేటట్టుగా అయితేనే చేరమని ఖరాఖండిగా తేల్చిచెప్పారట. పలు ప్రశ్నలు సైతం అన్నా రాంబాబుకి ఎదురయ్యాయని సమాచారం.

జైలు శిక్ష పడటం, ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలను వేధించడం, కులాల వారీగా దూషించడం లాంటి అంశాలు అన్నా రాంబాబుపైన వినిపిస్తున్న ప్రధాన ఆరోపణలు. వీరి కారణంగానే టికెట్ రాదని సీనియర్ నాయకులు అన్నా రాంబాబుకి స్పష్టం చేసారని సమాచారం. దీంతో మంతనాలు విఫలమైన అన్నా రాంబాబు పైవాటికి సరైన సమాధానం చెప్పలేక వెనక్కు వచ్చినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఇంక ఎటూ వెళ్లలేక రాజీకీయాల్లో తన ఉనికిని నిలుపుకోవడం కోసం వైఎసార్సీపిలో చేరడానికి సిద్ధమైనట్టు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -