Tuesday, May 14, 2024
- Advertisement -

టీడీపీకీ మాజీ కేంద్ర మంత్రి రాజీనామా…వైసీపీలోకి..

- Advertisement -

ఎన్నిక‌ల వేల టీడీపీ ప్ర‌భుత్వానికి వ‌రుస ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. ఒక వైపు పార్టీని వీడుతున్న నేత‌లు..మ‌రో వైపు కోర్టుల్లో ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. అధికారుల బ‌దిలీ విష‌యంలో హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఇక వైఎస్ వివేకా హ‌త్య కేసులో ఎవ‌రూ బ‌హిరంగంగా వ్యాఖ్య‌లు చేయ‌కూడ‌ద‌ని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప‌దే ప‌దే ఈహ‌త్య‌ను రాజ‌కీయంగా వాడుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇద‌లా ఉంటె ఇప్పుడు తాజాగా టీడీపీకీ చెందిన కేంద్ర మాజీమంత్రి పార్టీకి రాజీనామా చేయ‌డంతో క‌డ‌ప‌లో ఆ పార్టీకి ఎదురు దెబ్బ త‌గిలింది.

రాజంపేట నుంచి ఆరు సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా ప‌నిచేసిన సాయిప్ర‌తాప్ టీడీపీకీ గుడ్ బాయ్ చెప్పారు. పార్టీలో ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌డంతో గ‌త కొంత కాలంగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్న ఆయ‌న‌ పార్టీకి రాజీనామా చేసేందుకు నిర్ణ‌యించుకున్నారు.ఎంపీ టికెట్‌ ఇవ్వకపోవడంతో పాటు, పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సాయి ప్రతాప్‌ వెల్లడించారు.

యూపీఏ హయాంలో ఆయన కేంద్రమంత్రిగా కొనసాగిన సాయిప్ర‌తాప్‌… రాజంపేట నుంచి ఆరుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. వైఎస్ మ‌ర‌ణానంతో ప‌రిణామాలు మారిపోయాయి. 2014లో రాష్ట్ర విభజన తరువాత కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వ‌చ్చారు. అదే స‌మ‌యంలో వైసీపీలో చేరుతున్నార‌నే వార్త‌లు వ‌చ్చినా …ఆయ‌న 2016 లో టీడీపీలో చేరారు. మ‌రో సారి టీడీపీ త‌రుపునుంచి రాజంపేట ఎంపీగా అవ‌కాశం వ‌స్తాద‌ని భావించిన ఆయ‌న‌కు బాబు హ్యాండ్ ఇచ్చారు. ఎంపీ రేసులో ఆయ‌న పేరును ప‌రిగ‌ణించ‌కుండా…మాజీ ఎంపీ ఆదికేశవులునాయుడు భార్య, టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రభకు రాజంపేట ఎంపీ టికెట్ కేటాయించింది టీడీపీ. దీంతో కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్నా ఆయ‌న కీల‌కం స‌మ‌యంలో టీడీపీకీ రాజీన‌మా చేశారు. ఆయ‌న త్వ‌ర‌లోనె వైసీపీలో చేర‌నున్నార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -