Monday, May 6, 2024
- Advertisement -

వైసీపీలో ఆ సీనియ‌ర్ నేత‌కు టికెట్ ద‌క్కుతుందా …? లేదా…?

- Advertisement -

ఎన్నిక‌లు ముంచుకొస్తున్న త‌రుణంలో టికెట్ల కేటాయింపు జ‌గ‌న్‌కు క‌త్తిమీద సాములా మారింది. ఈ సారి అధికారంలోకి రావాల‌ని జ‌గ‌న్ విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. స‌ర్వే ప్ర‌కారం గెలుపు గుర్రాల‌కే టికెట్లు ఇవ్వాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించ‌డంతో పార్టీలోని సీనియ‌ర్ నేత గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి. ఈ సారి టికెట్‌వ‌స్తాదో రాదో అనే ఆందోళ‌న‌లో ఉన్నారు ఆశావ‌హులు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన కొద్ది రోజులకే అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఎన్నికల ప్రచార బరిలో దిగాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారు.

ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ళ తేది ఎక్కువ దూరంలో లేక‌పోవ‌డంతో…టికెట్ల కేటాయింపుపై ప్ర‌త్యేక దృష్టి సారించారు జ‌గ‌న్‌. తాజాగా పార్టీలోని సీనియర్ నాయకుడికి టికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నట్టు పార్టీ వ‌ర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు సిద్ధమవుతున్నారు. రాంబాబు మొద‌టినుంచి జ‌గ‌న్‌కు తోడుగా న‌డుస్తున్నారు.

స‌ర్వే ప్ర‌కారం అక్క‌డ రాంబాబు గెలిచే సూచ‌న‌లు క‌నిపిండంలేదంట‌. స‌ర్వే ఫ‌లితాలు సానుకూలంగా లేక‌పోవ‌డంతో ఈసారి అంబ‌టికి టికెట్ ఇవ్వ‌కూడ‌ద‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. ప్రస్తుతం ఇక్కడి నంచి టీడీపీ సీనియర్ నేత, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆర్థిక ప‌రంగా బ‌ల‌మైన అభ్య‌ర్ధిగా ఉన్న కోడెల‌ను ఢీకొట్టాలంటే వైసీపీ త‌రుపునుంచి బ‌ల‌మైన అభ్య‌ర్థే ఉండాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారంట‌. గ‌త కొంత కాలంగా టీడీపీపై అసంతృప్తితో ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. టీడీపీ అధిష్టానంపై గుర్రుగా ఉన్న ఆయ‌న త్వ‌ర‌లో వైసీపీలోకి వ‌స్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. మోదుగుల‌ను వైసీపీ తరపున సత్తెనపల్లి నుంచి రంగంలోకి దింపాలని జగన్ భావిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మ‌రి అంబ‌టికి టికెట్ ద‌క్కుతుందా లేదా అన్న స‌స్పెన్స్ కొన‌సాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -