Tuesday, April 23, 2024
- Advertisement -

పవన్.. ఇలా అయితే కష్టమే !

- Advertisement -

ఏ పార్టీ అధ్యక్షుడైన రాజకీయాల్లో రాణించాలంటే ముందుగా తనకు తను బలమైన నాయకుడిగా నిరూపించుకోవాలి. అప్పుడే ప్రజల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది. ఆ విషయంలో జనసేన అధ్యక్షుడు చాలా వెనకబడ్డారనే చెప్పవచ్చు. ఎందుకంటే ఒక బలమైన నాయకుడిగా గుర్తింపు పొందాలంటే.. తనకంటూ ఒక బలమైన నియోజిక వర్గం ఉండాలి. ఆ నియోజిక వర్గంలో తనకు తప్ప వేరే ఏ ఇతర పార్టీలకు అవకాశం లేనంత మెజారిటీ సొంతం చేసుకునే విధంగా ఉండాలి. ఉదాహరణకు వైఎస్ జగన్ కు పులివెందుల, అలాగే చంద్రబాబు నాయిడు కు కుప్పం, ఆవిధంగా పవన్ కు కంచుకోటగా ఉండే నియోజిక వర్గం ఏది అంటే సమాధానం దొరకడం కష్టమే..

ఎందుకంటే గత ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన భీమవరం, గాజువాక వంటి రెండు నియోజిక వర్గాలలో కూడా ఘోర ఓటమి చవిచూశారు. ఆ రెండు నియోజిక వర్గాలలో కూడా పవన్ అభిమానులు చాలా ఎక్కువ.. అయినప్పటికి అక్కడ రెండు చోట్ల పవన్ ఓటమిపాలు కావడం అందరినీ ఆశ్చర్య పరిచింది. దీంతో పవన్ కు కంచుకోటగా ఉండే నియోజిక వర్గం ఒక్కటి కూడా లేదు అనే వాదనలు వస్తున్నాయి. అయితే కంచుకోట లేనప్పటికి, ఏదో ఒక నియోజిక వర్గాన్ని కంచుకోటగా మార్చుకునే ప్రయత్నం కూడా పవన్ చేయడం లేదు అనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఎందుకంటే గత ఎన్నికల్లో పరాభవం తరువాత పవన్ పార్టీని బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టారే తప్పా .. ముందు తాను బలపడేందుకు సరైన నియోజిక వర్గం ఎంచుకొని దానిపైన దృష్టి పెట్టడం లేదనేది బహిరంగ వాదన.

ఎన్నికలకు ఇంకా రెండేళ్ళు సమయం ఉన్నప్పటికి, ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి పవన్ ముందు తను పోటీ చేయబోయే నియోజిక వర్గాన్ని ఎంచుకొని, ఆ నియోజిక వర్గంలో ఎక్కువ సమయం ప్రజలతో గడిపేందుకు దృష్టి పెట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. మరి పవన్ రాబోయే ఎన్నికల్లో తను పోటీలో దిగేందుకు ఏ నియోజిక వర్గం ఎంచుకుంటాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన భీమవరం, గాజువాక నియోజిక వర్గాలనే మళ్ళీ ఎంచుకుంటాడా ? లేక వేరే కొత్త నియోజిక వర్గం వైపు చూస్తాడా ? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటికి పవన్ కు అడ్డాగా ఉండే కంచుకోట ఒక్కటి కూడా లేకపోవడం కాస్త కలవరపెట్టే అంశమే. మరి ఈ అంశం పై పవన్ ఫోకస్ ఎలా ఉంటుందో చూడాలి.

More Like This

ఒకే దారిలో టీడీపీ, వైసీపీ .. అసలెందుకు ?

సై, అంటున్న కే‌సి‌ఆర్, జగన్ ?

ఆధిపత్యం కోసం పోరు.. గెలుపెవరిది ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -