అనుచరుడి భాస్కరరావు అంత్యక్రియల్లో కుప్పకూలిన నాని..!

- Advertisement -

ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ఇవాళ ఆస్వస్థతకు గురయ్యారు. మచిలీపట్నంలో తన ముఖ్య అనుచరడు అయిన మోకా భాస్కరరావును నిన్న ప్రత్యర్ధులు దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. దాంతో నాని తీవ్ర మనస్తాపానికి లోనైయ్యారు. ఈ రోజు అంత్యక్రియల్లో పాల్గొంటుండగా ఆయన కుప్పకూలారు. దాంతో వెంటనే అనుచరులు ఆయనకు ప్రాధమిక చికిత్స అందించారు.

ఆ తర్వాత ఆయన కాస్త మాములయ్యారు. సోమావరం రోజు భాస్కరరావు హత్యకు గురైన విషయం తెలుసుకున్న నాని.. తీవ్ర డిప్రెషన్ కు లోనైయ్యారు. ఈ రోజు ఉదయం ఆయన ఎలాంటి ఆహరం తీసుకోలేదు. దాంతో డీహైడ్రేషన్ కు గురై సృహతప్పినట్లు తెలుస్తోంది. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు మచిలీపట్నంలోని స్మశాన వాటికకు వెళ్లిన నాని.. అక్కడే స్పృహ కోల్పోయారు. వెంటనే అనుచరులు పక్కకు తీసుకెళ్లి ఆయనకు మంచినీరు ఇచ్చారు. తర్వాత ప్రాధమిక చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానేఉందని తెలుకున్న ఫ్యాన్స్ కి కంగారు తగ్గింది.

- Advertisement -

ఇక భాస్కర్ రావు మునిసిపల్ చేపల మార్కెట్‌లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు అతనిని కత్తి తో పొడిచి హత్య చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన భాస్కరరావు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇక ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. భాస్కరరావును హత్య చేసేందుకు మూడు రోజులుగా రెక్కీ నిర్వహించినట్టు తెలుస్తోంది. కత్తితో హత్య చేసిన వ్యక్తిని చింత పులిగా గుర్తించాం. హత్య చేసి అనంతరం బైక్‌పై ఎక్కించికెళ్లిన మరో నిందితుడు చింత చిన్ని. హత్యపై పొలిటికల్ వార్ వున్నట్టు తెలుస్తోంది అని తెలిపారు.

ఉచితంగా ఇసుక పంపిణీ : జగన్ సంచలన నిర్ణయం..!

విశాఖ నుంచే పరిపాలన.. జగన్ ఫిక్స్..!

విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిందెవరంటే?

వైసీపీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ : వైసీపీలోకి 5 ఎమ్మెల్సీలు జంప్

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -