Wednesday, April 24, 2024
- Advertisement -

విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిందెవరంటే?

- Advertisement -

వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ లకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అవమానకరమైన పోస్టులు పెట్టిన టీడీపీ సానుభూతి పరుడు నలంద కిషోర్ ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ వ్యవహారం ఏపీ రాజకీయ వర్గాలలో కలకలం రేపింది. ఈ నలంద కిషోర్ మరెవరో కాదు… మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస్ రావు అనుచరుడు కావడం గమనార్హం.

అయితే తాజాగా తన అనుచరుడి అరెస్ట్ పై గంటా స్పందించారు. సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న పోస్టింగ్ ను ఫార్వర్డ్ చేసినందుకు తన అనుచరుడిని అరెస్ట్ చేయడం దారుణమని గంటా శ్రీనివాసరావు నిరసన వ్యక్తం చేశారు. ఆ పోస్టును అసలు ఎవరు సృష్టించారో వారిని అరెస్ట్ చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఈ పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆరాతీసిన పోలీసులకు దిమ్మదిరిగే సమాధానం దొరికిందట..

పరిపాలన రాజధానిగా విశాఖను చేయాలని భావించిన సీఎం జగన్ ఆ అభివృద్ధి పర్యవేక్షణ బాధ్యతను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అప్పగించారు. ప్రస్తుతం సాయిరెడ్డి ఒక ప్రభుత్వ అధికారులు, మంత్రులతో కలిసి ఒక బృందంగా పనిచేస్తున్నారు. ఈ బృందంలోనే ఉన్న ఒక కమ్మ ఆడిటర్ ఈ వివాదాస్పద పోస్ట్ ను చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. విజయసాయిరెడ్డి బృందంలోనే ఉంటూ ఆయనకు వ్యతిరేకంగా ఈ పోస్టును టీడీపీ నేతలకు, సోషల్ మీడియాకు ఈ కమ్మ ఆడిటరే లీక్ చేశాడని పోలీసులు తేల్చినట్టు సమాచారం.

ఈ కమ్మ ఆడిటర్ విశాఖను అభివృద్ధి చేసే విజయసాయిరెడ్డి బృందంలో ఆడిటర్ గా పనిచేస్తున్నాయి. విశాఖలో భూకబ్జా కార్యకలాపాలు చేసే ప్రయత్నం చేశారని.. కానీ సాయిరెడ్డి దగ్గర ఆ ఆటలు చెల్లకపోవడంతో ఇలా పోస్ట్ పెట్టి అభాసుపాలు చేయాలని చూశాడని విచారణలో తేలిందట.. ఈయనకు పొరుగు జిల్లాకు చెందిన మరో సీనియర్ వైసీపీ నాయకుడు కూడా సహకరించారని విచారణలో తేలింది.

జగన్ ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న ఈ నాయకుడు విశాఖపట్నం రాజకీయాలలో పూర్తి పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ విజయసాయిరెడ్డి కనుసన్నల్లో అంతా పారదర్శకంగా జరుగుతుండడంతో తట్టుకోలేక ఇలా ఆడిటర్ ద్వారా ఆయనను అభాసుపాలు చేసే కుట్రకు తెరతీశాడని పోలీసులు భావిస్తున్నారు.

విశాఖలో భూ కబ్జాలు చేయడానికి సహకరించని కారణంగా విజయసాయిరెడ్డిపై పగ తీర్చుకోవడానికే కమ్మ ఆడిటర్ తో చేతులు కలిపి సదురు వైసీపీ సీనియర్ నేత సోషల్ మీడియాలో వారి ప్రతిష్ట దిగజార్చేలా పోస్టులు ప్రచారం చేయించాడని తేలింది. సాయిరెడ్డి, అవంతి ఇద్దరూ విశాఖ బృందంలో ఉండడంతో వీరిద్దరినీ సోషల్ మీడియా ద్వారా అవమానించేలా ఈ పోస్టులు సర్య్కూలేట్ చేసినట్టు సమాచారం.

ఈ పోస్టింగ్ లను షేర్ చేసిన టీడీపీ కార్యకర్త నలంద కిషోర్ ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా ఈ నిజాలన్నీ బయటపెట్టినట్టు సమాచారం. కానీ పోస్టింగులు సృష్టించిన నిజమైన నిందితులు ఇప్పుడు సేఫ్ సైడ్ లో ఉండగా.. దానిని షేర్ చేసిన నలంద కిషోర్ బుక్కైపోయాడు. త్వరలోనే ఆ ప్రధాన నిందితులపై కూడా చర్యలు తీసుకునే దిశగా పోలీసులు విచారణను వేగవంతం చేస్తున్నట్టు తెలిసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -