Wednesday, April 24, 2024
- Advertisement -

ఏపీలో భాజాపాకు షాక్‌… ఈనెల 21న జ‌న‌సేన‌లోకి ఎమ్మెల్యే

- Advertisement -

మూలిగే న‌క్క‌మీద తాటికాయ ప‌డ్డ చందంలాగా త‌యార‌య్యింది ఏపీలో భాజాపా ప‌రిస్థితి. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో టీపీతో పొత్తు పెట్టుకోవ‌డం వ‌ల్ల కొన్ని ఎమ్యెల్యే సీట్లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. నాలుగేళ్లు కాపురం చేసి ఎన్నిక‌ల స‌మ‌యంలో విడాకులు తీసుకున్నారు బాబు. దీంతో భాజాపా ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారింది.

విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీకి రావాల్సిన హామీలు అమ‌లు చేయ‌డంలో కేంద్రం విఫ‌లం చెంద‌డంతో తీవ్ర వ్య‌తిరేక‌త ఏపీ ప్ర‌జ‌ల్లో వ్య‌క్తం అవుతోంది. ఇరు పార్టీల నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. భాజాపాలో ఉన్న టాప్ లీడ‌ర్లు ఇప్పుడు టీడీపీ, జ‌న‌సేన వైపు చూస్తున్నారు. మాజా మంత్రి కామినేని, ప్లోర్ లీడ‌ర్ విష్ణుకుమార్ రాజు టీడీపీలోకి వెల్లే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఇక తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి అర్బన్‌ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ పార్టీకి, ఎమ్మెల్యే ప‌ద‌వ‌కి రాజీనామా చెప్పనున్నట్టు ప్ర‌క‌టించారు. ఈ నెల 21న తాను జ‌న‌సేన‌లో చేరుతున్న‌ట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని, ప్రధానంగా మూడు అంశాల్లో అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. విశాఖ రైల్వేజోన్‌, దుగరాజపట్నం పోర్టు, కడపలో స్టీల్‌ప్లాంట్‌ మంజూరు చేయకుండా అన్యాయం చేసిందని తెలిపారు.

రానున్న ఎన్నికల్లో ఆకులకు రాజమండ్రి లోక్ సభ స్థానం… ఆయన భార్య పద్మావతికి రాజానగరం అసెంబ్లీ స్థానం కేటాయించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంగీకరించినట్టు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -