- Advertisement -

జమ్మూకాశ్మీర్ పై బీజేపీ సంచలన నిర్ణయం

- Advertisement -

జమ్మూ కాశ్మీర్.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్-భారత్ ల మధ్య ఎడతెగని పంచాయతీకి కారణమైంది. జమ్మూ మాదేనని పాకిస్తాన్ కొట్లాడడం.. భారత్ తమ అంతర్భాగం అని యుద్ధాలు చేయడం జరిగిపోయింది. 70 ఏళ్లుగా రావణ కాష్టంలా రగులుతున్న కాశ్మీర్ లో ఉగ్రమూకలు ఎన్ని మారణహోమాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అందుకే ఇప్పుడు రెండోసారి గద్దెనెక్కిన బీజేపీ ఆపరేషన్ జమ్మూకాశ్మీర్ చేపట్టినట్టు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. తాజాగా రక్షణ, హోంమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షాలు జమ్మూకాశ్మీర్ లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. అక్కడ రాష్ట్రపతి పాలనను కొనసాగించాలని నిర్ణయించారు. ఇక రెండు రోజులుగా జమ్మూకాశ్మీర్ లోనే ఉన్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ అక్కడ సీనియర్ ఉన్నతాధికారులతో మాట్లాడి ఢిల్లీకి తిరిగి చేరుకోగానే కీలక ఆదేశాలు వెలువడడం సంచనలంగా మారింది. జమ్మూ కాశ్మీర్ కు కొత్తంగా 10వేల ట్రూపుల పారామిలటరీ బలగాలను పంపుతూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.

ముఖ్యంగా ఉత్తర కాశ్మీర్ లో ఉగ్రవాద చర్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడే పెద్ద ఎత్తున ఉగ్రవాదులు నక్కారన్న సమాచారం కేంద్రం వద్ద ఉంది. త్వరలోనే జమ్మూలో ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రం రెడీ అయ్యింది. అందులో భాగంగానే కొత్త ప్రభుత్వం వస్తే ఆపరేషన్ చేయడం కష్టమని ముందే పెద్ద ఎత్తున బలగాలను దింపు కాశ్మీర్ లో ఉగ్రవాదులను లేకుండా చేయాలని బీజేపీ ప్లాన్ చేసినట్టు సమాచారం.

ఆపరేషన్ జమ్మూకాశ్మీర్ పేరిట.. ఆ రాష్ట్రంలో అసలు ఉగ్రవాదులను తుదముట్టించడమే అంతిమలక్ష్యమట. కాశ్మీర్ ను ఉగ్రవాద రహిత రాష్ట్రం చేయడానికి దేశంలోని పారామిలటరీ బలగాలను ప్రత్యేక విమానాల్లో జమ్మూకు తరలిస్తున్నారు. దీంతో జమ్మూలో ఏదో జరగబోతోందన్న అంచనాలు నెలకొంటున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -