- Advertisement -

కేసీఆర్‌ను లేపి త‌న్నించుకోవ‌డం అంత స‌ర‌దానా….!

- Advertisement -

త్వ‌ర‌లో ఏలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం అన్ని పార్టీలు ఎన్నిక‌ల ప్ర‌చారంలో దూసుకుపోతున్నాయి. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు చేసుకుంటున్న విమ‌ర్శ‌లు తారాస్థాయికి చేరాయి. విచిత్రం ఏంటంటె అధికారంలో ఉన్న బాబును ప్ర‌శ్నించాల్సిన జ‌న‌సేన‌నుడు విడ్డూరంగా ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గన్‌ను టార్గెట్ చేయ‌డం మొద‌లు పెట్టారు. ఇద‌లా ఉంటె అధికారంలోకి రామ‌ని ముందే తేలిపోవ‌డంతో చంద్ర‌బాబు, ప‌వ‌న్‌లు కొత్త అవ‌తారం ఎత్తారు.

ప్ర‌జాసంక్షేమానికి ఎలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తామో ప్ర‌జ‌ల‌కు చెప్పి అధికారంలోకి రావాలిగాని…ప‌క్క రాష్ట్రం సీఎంను బూచిగా చూపిస్తూ అధికారంలోకి రావ‌డానికి నీచ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. బాబు, ప‌వ‌న్‌లు ఇద్ద‌రు తెలంగాణా సీఎం కేసీఆర్ మీద ప‌డి ఏడుస్తున్నారు. ఎట్లా మ‌నం గెల‌వలేం క‌నీసం కేసీఆర్‌ను తిట్టైన ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చ గొట్టి కొంతైనా ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని చూస్తున్నారు. ఎన్నిక‌ల ప్రాచ‌రంలో ఎక్క‌డ‌కు పోయినా కేసీఆర్ పేరును ఉచ్చ‌రించంది నిద్ర‌రాదు ఇద్ద‌రికి.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో జగన్ కు ఓటేస్తే కేసీఆర్ కు వేసినట్టే అంటూ.. ఒకే డైలాగును పవన్, బాబులు రిపీట్ చేయడం వెనుక కేసీఆర్ ను రెచ్చగొట్టే ఉద్దేశం ఉందని స్పష్టం అవుతోంది. కేసీఆర్.. కేసీఆర్ అంటూ మ‌మ్మ‌ల్ని తిట్టండి అంటూ బెగ్గింగ్ అవ‌తారం ఎత్తారు. త్వ‌ర‌లో కేసీఆర్ కూడా ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభించ‌నున్నారు. తెలంగాణ ఎన్నికల ప్ర‌చారం సభల్లో కేసీఆర్ ఏదో ఒకటి అనకపోడా.. దాన్ని అడ్డంపెట్టుకుని.. ‘చూశారా కేసీఆర్ తిట్టాడు, మమ్మల్ని తిట్టాడు కాబట్టి.. ఆంధ్రులందరినీ తిట్టినట్టే.. అలాంటి కేసీఆర్ తో జగన్ కు సత్సంబంధాలున్నాయంటూ మ‌డ‌త రాజ‌కీయం మొద‌లెట్టాల‌ని ఎదురు చూస్తున్నారు.

2014 ఎన్నిక‌ల్లో టీడీపీ, భాజాపాకు ప‌వ‌న్ మ‌ద్ద‌తు తెలంప‌డంతో టీడీపీ అధికారంలోకి వ‌చ్చింది. నాలుగు సంత్స‌రాలు టీడీపీతో అంట‌కాగి ప‌వ‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చారు. అది కూడా టీడీపీపై పోరాడుతున్నారా అంటె అదీలేదు. బాబును వ‌దిలి పెట్టి జ‌గ‌న్ మీద ప‌డి ఏడుస్తున్నారు. ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి ఈ ఐదేళ్ల‌లో అభివృద్ది గురించి ప్ర‌జ‌లకు చెప్పుకొనే స్థితిలో లేరు. అందుకే తెలంగాణలో సీమాంధ్రులపై దాడులు జరుగుతున్నాయనే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చ‌గొడుతూ ఎన్నిక‌ల్లో రాజ‌కీయంగా ల‌బ్ధిపొందేందుకు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అయినా వీళ్లు చేసె జిమ్మిక్కులను ప్ర‌జ‌లు న‌మ్మేలాలేరు. సైలెంట్‌గా ఉన్న కేసీఆర్‌ను గెలుక్కోని ..బాబూ మ‌మ్మ‌ల్ని తిట్టండ‌ని త‌న్నించుకోవ‌డం అంత అవ‌స‌ర‌మా అని విశ్లేష‌కులు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -