Friday, May 17, 2024
- Advertisement -

జాతీయ స్థాయిలో విమర్శలొస్తున్నా బాబు తగ్గట్లేదు…. మరోసారి ప్రజలను తిట్టేశాడు

- Advertisement -

2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం చంద్రబాబు ఏం చేశాడో ఎవ్వరూ ఇదమిత్థంగా చెప్పలేని పరిస్థితి. అప్పులు మాత్రం రెండు లక్షల కోట్లకు పెరిగిపోయేలా చేశాడు. ఇక రాజధాని నిర్మాణం మొత్తం గ్రాఫిక్స్ బొమ్మల్లో మాత్రం పూర్తి చేసేశాడు. మోడీ చేత ఇప్పిస్తానన్న హోదాతో సహా కేంద్రం ఇవ్వాల్సిన హామీలు, తాను చేస్తానన్న ఆరు వందల హామీలను మాత్రం పూర్తిగా అటకెక్కించేశాడు. ఎన్నికల సమయంలో తన భజన చేసిన పవన్ చెప్పిన హీరోయిన్స్‌ని బ్రాండ్ అంబాసిడర్స్‌ని చేస్తూ, పవన్‌కి అన్ని విధాలా సాయం చేస్తూ పాలన సాగదీస్తున్నాడు బాబు. ఇక తన భజన తాను చేసుకుంటూ ప్రచారం చేసుకోవడానికి మాత్రం కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టేస్తున్నాడు. అదనంగా తనతో పాటు మంత్రులు, అధికారులకు మాత్రం విదేశాలన్నీ చూపిస్తున్నాడు. దేశంలోనే అత్యంత ఎక్కువ ఆర్థికలోటులో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకంటే కూడా ప్రచారం కోసం ఎక్కువ ఖర్చుపెట్టేస్తున్నాడు.

అలాంటి చంద్రబాబు తాజాగా పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్న రైతులపై విరుచుకుపడిపోయాడు. ఫొటోలకు ఫోజులు ఇవ్వడం కోసం ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని ఆవేశపడిపోయాడు. ఫొటోల కోసం, ప్రచారం కోసం నిలదీయడం ఏంటని మద్ధతు ధర ఇప్పించాలని అడిగిన రైతులపై ఆవేశపడిపోయాడు చంద్రబాబు. ఇక ఇదే సందర్భంలో సాక్షి మీడియాను కూడా ఆడిపోసుకున్నాడు. మీరు ఇలా వచ్చి అడగడం……ఆ తర్వాత సాక్షి వాళ్ళు మీ ఫొటోలు వేయడం అంటూ సెటైర్స్ వేశాడు. మొత్తానికి చంద్రబాబు ఒకటైతే ఒప్పుకున్నట్టే. సాక్షి తప్ప చంద్రబాబుని ప్రశ్నిస్తున్న, నిలదీస్తున్న ఆంద్రప్రదేశ్ ప్రజల గోడు వినిపించుకునే మీడియా మరొకటి లేదని చెప్పకనే చెప్పేశాడు. అయితే తమ సమస్యలు చెప్పుకోవడానికి బాబు దగ్గరకు వచ్చిన రైతులను ఫొటోల కోసం వస్తున్నారని, పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారని అనడం మాత్రం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. నంద్యాల ఉప ఎన్నికల సమయం నుంచీ కూడా చంద్రబాబు ప్రజలపై విరుచుకుపడడం, ప్రజలంతా కూడా తాను చెప్పినట్టు వినాలన్నట్టుగా వ్యవహరించడం బాగా ఎక్కువైందన్నది నిజం. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రజల సేవకుడిని అన్న విషయం మరిచిపోయి తనను తాను నియంతగా అనుకుంటున్నాడో ఏమో తెలియదు గానీ బాబు వ్యవహారంపై మాత్రం చాలానే విమర్శలొస్తున్నాయి.

ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే జన్మభూమి……..ప్రజలంతా వచ్చి సమస్యలు చెప్పుకుంటే అక్కడికక్కడే పరిష్కరిస్తా అని పబ్లిసిటీ స్టంట్స్ చేసే చంద్రబాబు…….మద్ధతు ధర కల్పించండి బాబుగారు అని అడిగిన రైతులతో……..‘ఫొటోలకు ఫోజులివ్వడం నిలదీయడం అలవాటైంది’ అని విమర్శించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో బాబుగారే చెప్పాలి మరి. జన్మభూమి పేరుతో కేవలం పబ్లిసిటీ స్టంట్స్ చేస్తున్నారని, కోట్లాది రూపాయల ప్రజా సొమ్మును పచ్చ బ్యాచ్ జేబుల్లోకి పంపడానికి తప్ప ప్రజా సమస్యల కోసం కాదని ఇక్కడే అర్థమైపోవడం లేదా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -