Saturday, May 18, 2024
- Advertisement -

బిజెపితో బాబు మంతనాలు…. కాళ్ళబేరమా? రాష్ట్రం కోసమా?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పన్నిన ఒక రాజకీయ వ్యూహం అయితే అడ్డంగా ఎదురుతన్నింది. 2019 ఎన్నికలను ఎదుర్కోవడం కోసం బాబు రచించిన ప్లాన్ మొత్తం ఇప్పుడు పూర్తిగా ఫ్లాప్ అయింది. బిజెపిపైన రాష్ట్ర ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో బిజెపిని వదిలించుకుని, పవన్‌తో కలిసి ఎన్నికలను ఎదుర్కోవాలనుకున్నాడు చంద్రబాబు. అయితే బాబు కూడా ఊహించని విధంగా చంద్రబాబుపైన ఉన్న వ్యతిరేకత తనపైన ఎక్కడ ప్రభావం చూపుతుందో అని ఆలోచించిన పవన్ బాబుకు దూరమయ్యాడు. హోదా, రైల్వేజోన్ లాంటి హామీలు ఎగ్గొట్టిన బిజెపిపై ప్రజలు ఎంత కోపంగా ఉన్నారో….రుణమాఫీలాంటి హామీలో విషయంలో మోసం చేయడం, హోదా విషయంలో పూటకో మాట మాట్లాడిన బాబుపై కూడా ప్రజల్లో అదే స్థాయి కోపం ఉందని పవన్ టీంలో ఉన్న విశ్లేషకులు తేల్చిచెప్పారు. దాంతో బాబుకు దూరమయ్యాడు పవన్.

ఆ దెబ్బతో చంద్రబాబు పూర్తిగా ఒంటరి అయ్యాడు. అన్నింటికీ మించి నరేంద్రమోడీ జగన్‌కి సన్నిహితమవుతున్నాడన్న భయం కూడా బాబును వెంటాడుతోంది. అలాగే 2019 తర్వాత కూడా మెజారిటీ తగ్గినప్పటికీ మోడీనే ప్రధానమంత్రి అవ్వడం ఖాయమని జాతీయ స్థాయి సర్వేలు తేల్చిచెప్తున్నాయి. అందుకే ఇప్పుడు మళ్ళీ మోడీతో కాళ్ళ బేరానికి రెడీ అయ్యాడు బాబు. 2019 ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌తో పాటు కేంద్ర సంస్థలు తన గెలుపుకు మద్దతిస్తే 2019 ఎన్నికల తర్వాత మోడీకి భేషరతుగా మద్దతిస్తానని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఛీఫ్‌తో, గవర్నర్ నరసింహన్‌తో తేల్చి చెప్పేశాడు చంద్రబాబు. బాబుతో మీటింగ్ అయ్యాక ఈ రోజు డిల్లీ వెళ్ళిన గవర్నర్‌ కేంద్ర బిజెపి పెద్దలతో అదే విషయం చర్చించనున్నాడని తెలుస్తోంది. 2019 ఎన్నికలయ్యేవరకూ ఏం మాట్లాడినా ప్రజల మెప్పుకోసమే అని……మోడీపైన అభిమానం, గౌరవం ఉన్నాయని….ఎన్నికల తర్వాత కచ్చితంగా మోడీకే మద్దతు ఇస్తానంటూ చంద్రబాబు చెప్పిన విషయాలను కేంద్ర పెద్దల చెవిన వేయనున్నాడు గవర్నర్. ఇదే విషయం ఇప్పుడు ఢిల్లీ జర్నలిస్టుల చర్చల్లో హాట్ టాపిక్ అయింది. ముందు ముందు పరిణామాలు ఎలా మారతాయో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -