Sunday, May 5, 2024
- Advertisement -

షర్మిలకు ఊరు పేరు లేదా?

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రధానంగా పోరు బీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్య ఉండనుండగా రెండు పార్టీలు తమదైన ఎత్తుగడలతో ముందుకు వెళ్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌లో టికెట్ దక్కని నేతలు కాంగ్రెస్ వైపు చూస్తుండగా ఆ పార్టీకి టికెట్ల కేటాయింపు తలనొప్పిగా మారింది.

ఈ నేపథ్యంలో టీకాంగ్రెస్‌కు బూస్ట్ ఇచ్చేందుకు షర్మిల రంగంలోకి దిగుతోంది. తన వైఎస్‌ఆర్‌టీపీని త్వరలోనే కాంగ్రెస్‌లో విలీనం చేయనుంది. ఇంతవరకు బాగానే ఉన్న సొంతపార్టీ నేతల నుండి ఆమెకు సపోర్టు లభిస్తుందా అంటే అంతుచిక్కని ప్రశ్నే. ఎందుకంటే ప్రతిరోజు షర్మిల…సీఎం కేసీఆర్‌ను తిట్టడం సంగతి పక్కన పెడితే టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డిని సైతం తీవ్రంగా విమర్శించారు. ఓ దశలో ఆయనపై వ్యక్తిగతంగా దూషించే స్ధాయికి వెళ్లారు షర్మిల. ప్రధానంగా రేవంత్‌ని ఉద్దేశించి షర్మిల చేసిన పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర అనే డైలాగ్ ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతోంది.

ఇక రేవంత్ రెడ్డి వర్గంతో పాటు ఇప్పుడు ఖమ్మం జిల్లా నేతల నుండి విమర్శలు తప్పేలా లేవు. తాజాగా రేణుకా చౌదరి…షర్మిలపై తనదైన శైలీలో సెటైర్లు వేశారు. షర్మిల తెలంగాణ కోడలైతే.. తాను తెలంగాణ ఆడబిడ్డనని …ఎన్నికల ముందు తాను తెలంగాణ కోడలు అని గుర్తు వచ్చిందా అంటూ ఘాటుగా స్పందించారు. షర్మిల ముందు అమరావతి రైతుల గురించి మాట్లాడాలని అలాగే పాలేరులో పోటీ చేయడానికి ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా అంటూ వ్యంగ్యాస్త్రాలుసంధించారు. అసలు ఆంధ్ర నేతలకు తెలంగాణలో ఏం పని ప్రశ్నించారు. అసలు షర్మిల పాలేరులో పుట్టిందా? ఆమె పాలేరుకు ఏమైనా చేసిందా? …ఊరు పేరు లేని వారు వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తే వారిని రాజకీయ రాబందులు అంటారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు షర్మిలతో పాటు ఆమెను నమ్ముకున్న నేతల పరిస్థితి ఏంటా అన్నది రాజకీయవర్గాల్లో చర్చనీయాశంగా మారింది.

ఇక మరోవైపు వైసీపీ నేతలు సైతం షర్మిల వచ్చినా తమ గెలుపును ఆపలేదని తేల్చి చెబుతున్నారు. కాంగ్రెస్ తో షర్మిల కలిసినా, ఎవరు వచ్చినా, ఎన్ని పార్టీలు వచ్చినా మరోసారి వైసీపీ గెలుపు తథ్యం అని సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఆశీస్సులతో రాజకీయంగా సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్న షర్మిలకు ఆదిలోనే చెక్ పడేలా కనిపస్తోందని పలువురు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -