Sunday, May 5, 2024
- Advertisement -

తూచ్..! లోక్ సత్తా కాదు… కొత్త పార్టీనే…

- Advertisement -

సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మి నారాయ‌ణ త‌న పొలిటిక‌ల్ ఎంట్రీపై పార్టీపై క్లారిటీ ఇచ్చారు. కొద్ది రోజులుగా కొత్త పార్టీ పెడతారా? లేక ఏదో ఒక పార్టీలో చేరతారా? అనే దానిపై కొద్ది రోజుల నుంచి ఉత్కంఠ నెలకొంది. లోక్‌సత్తా పార్టీ కొత్త సారధిగా ఆయన పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని మీడియా వర్గాల్లో ప్రచారం జరిగింది. ఈ వార్త‌లకు పుల్‌స్టాప్ పెట్టారు ల‌క్ష్మీనారాయ‌ణ‌.

త్వ‌ర‌లో కొత్త పార్టీనీ స్థాపిస్తున్నాన‌ని…దాని ద్వారానే ప్ర‌జ‌ల్లోకి వెల్తున్నాన‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు. రెండు రోజుల క్రితం తనకు మద్దతుగా నిలిచే వారితో సమావేశమైన లక్ష్మీనారాయణ… వారి సూచన సూచన మేరకు సొంత పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పార్టీ ప్రారంభ తేదీ, ప్రదేశం, ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తానని ఆయన తెలిపారు.

స్వంచ్ఛంద ప‌ద‌వీ వివ‌ర‌ణ ద్వారా ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చారు ల‌క్ష్మీనారాయ‌ణ‌. ఏపీలోని అన్ని ప్రాంతాల్లో రైతుల‌స‌మ‌స్య‌లు, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నం చేసిన సంగ‌తి తెలిసిందే. త‌ర్వాత ఆయ‌న జ‌న‌సేన లేదా టీడీటీలో చేరుతున్నార‌నే వార్త‌లు బ‌లంగా వినిపించాయి. పార్టీలో చేరాల‌ని టీడీపీ, జ‌న‌సేన నుంచి పిలుపు వ‌చ్చింద‌ని ఆయ‌నే స్వ‌యంగా ప్ర‌క‌టించారు.

కడప జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ కర్నూల్ జిల్లా శ్రీశైలంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. వరంగల్ నిట్ (అప్పట్లో ఆర్‌ఈసీ)లో ఇంజినీరింగ్, మద్రాస్ ఐఐటీలో ఎంటెక్ పూర్తిచేశారు. 1990లో మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. సీబీఐ జేడీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలకమైన కేసుల్లో ఆయన దర్యాప్తు చేశారు. జగన్ అక్రమాస్తుల కేసు, సత్యం కంప్యూటర్స్‌, గాలి జనార్దన్‌రెడ్డి అక్రమాలపై కేసులను దర్యాప్తు చేసి సంచలన సృష్టించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -