2019 ఎన్నికలు రాష్ట్రంలో జనసేన, టీడీపీ, వైసీపీకి ప్రధానం కానున్నాయి. ముఖ్యంగా జగన్‌కు ఈ ఎన్నికలు చావోరేవో లాంటివి. ఎన్నికల సమయంలో పొత్తులు కూడా ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఇక జనసేన పార్టీ ఒంటిరిగా పోటీ చేస్తుందా లేకా ఇతర పార్టీలకు మద్దతు ఇస్తుందా అనే దానిమీద స్పష్టతలేదు. రాజకీయ పరినామాలు ఎలా ఉన్నా జనసేన పాత్రే కీల్ రోల్ కానుందనడంలో సందేహంలేదు.
జనసేన అధ్యక్షుడు పవన్ కింగ్ మేకర్ అవుతాడనే వార్తలకు ఉండవల్లి వ్యాఖ్యలు బలాన్ని ఇస్తోంది.
వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనే కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అంటే టిడిపి-వైసిపి గెలుపోటములను శాసించేది పవన్ కల్యాణే అన్నది ఉండవల్లి అభిప్రాయంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఏ మేరకు విజయం సాధిస్తారో చూడాలన్నారు.
పవన్ ఒంటరిగా పోటీ చేసినా కొన్ని సీట్లు రావడం గ్యారెంటీ. ఇక వైసీపీ, టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చినా అధికారంలోకి రావాలంటే పవన్ మద్దతు కీలకం కానుంది. ఒక వేల టీడీపీతో కలసి ఎన్నికలకు వెల్తే అధికారంలోకి రావడానికి వైసీపీకి కష్టంగానే ఉంటుంది. మరి ఉండవల్లి వ్యాఖ్యలు నిజం అవుతాయో చూడాలి.
