Saturday, April 20, 2024
- Advertisement -

పాటల తూటాలతో కేసీఆర్ కోటకు బీటలు

- Advertisement -

తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిందీ పాటలే. ప్రత్యేకరాష్ట్రాన్ని సాధించిందీ పాటలే. ఆ పాటలు పాడిన కవులు, రచయితలు, గాయనీ గాయకులు మాత్రం బంగారు తెలంగాణలో గుర్తింపునకు కూడా నోచుకోలేకపోతున్నారు. కవులు కళాకారులను వాడేసి వదిలేశారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ సారి తమ పోరాటం కేసీఆర్ కుటుంబపాలన మీదేనని తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవులు, కళాకారులు, గాయనీ గాయకులు, రచయితలు చెబుతున్నారు. ఉద్యమకాలంలో గద్దర్ పోషషించిన పాత్ర చెప్పుకోదగినది. ఆయన పాటలు ఉద్యమకారులను ఉర్రూతలూగించాయి. నెత్తురు చల్లారకుండా వాడివేడి పుట్టించాయి. అటువంటి గద్దర్ ప్రత్యేక రాష్ట్రంలో కనుమరుగైపోయారు. తర్వాత నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై ఎప్పటికప్పుడు నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆయనకు తెలంగాణ కాంగ్రెస్ స్వాగతం పలికింది. త‌న ఆట‌, మాట, పాట‌లతో ప్ర‌జ‌ల మ‌న‌సు దోచుకున్న ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్‌ను తమ పార్టీలోకి రావాలని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మల్లు భట్టి విక్రమార్క‌ కోరారు. తన నివాసానికి గద్దర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించి మరీ సమావేశమయ్యారు. భట్టి విక్రమార్కతో గద్దర్ ఏకాంత చర్చలు జరిపారు. కేసీఆర్ కుటుంబపాలనకు చరమగీతం పాడాలంటే… గద్దరన్నా నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకోవాల్సిందేనని విన్నవించుకున్నారు భట్టి. పార్టీలో చేరికపై స్పష్టత ఇవ్వని గద్దర్ కేసీఆర్ ను గద్దె దించేందుకు మాత్రం పాట సాయం చేస్తానని హామీ ఇచ్చారు.

తెలంగాణ ఉద్యమకాలంలో గద్దర్ రాసి పాడిన ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగాణమా’ పాట ఓ ఊపు ఊపేసింది. ఉద్యమం చల్లారకుండా ప్రతి నోటా ప్రతి పూటా ఆ పాట వినిపించింది. మళ్లీ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే కాంగ్రస్ తో చేరి గద్దర్ అటువంటి పాటలను తూటాలుగా ఎక్కుపెట్టాలని భావిస్తున్నారు. పాటలంటే కేసీఆర్ కు ఇష్టంతో పాటు భయం కూడా. గతంలో అనేక పాటలను రాయించిన కేసీఆర్ ఓ పాటంటే భయపడ్డారు కూడా. ప్రముఖ ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న రాసి పాడిన ‘ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడురో తెలంగాణ ‘ అంటూ రాసిన పాట తెలంగాణలో, యూట్యూబ్ లో పెద్ద సంచలనమే అయింది. కోదండరామ్ స్ఫూర్తియాత్రలో ఆ పాట పదే పదే వేయడంపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఎవడి పాలయ్యింది ? ఎవడేలుతున్నాడు ? ఎవడు తెచ్చాడో వాడే ఏలుతున్నాడు. అంటూ కేసీఆర్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు గద్దర్ మహాకూటమి పక్షాన నిలబడి మళ్లీ పదునైన పాటల తూటాలు ఎక్కుపెడితే కేసీఆర్ కోటకు బీటలు ఖాయమేనని కూటమి సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -