Wednesday, April 24, 2024
- Advertisement -

వైసిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో గురునాధ్‌రెడ్డి భేటీ…… బాబు మైండ్‌గేమ్‌కు చెక్‌నా..

- Advertisement -

అనంత‌పురంలో వైసీపీని దెబ్బ కొట్టాల‌ని కొంత కాలంగా టీడీపీ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తోంది. పార్టీలో ప్ర‌జాబ‌లం ఉన్న నేత‌ల‌ను పార్టీలోకి లాక్కొని జ‌గ‌న్‌ను దెబ్బ‌తీసేంద‌కు బాబు మైండ్ గేమ్ ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. దానిలో బాగంగానె ఆపార్టీ సీనియ‌ర్‌నేత గురునాధ్‌రెడ్డికి గాలం వేసింది. గుర్నాధరెడ్డి టిడిపిలో చేరబోతున్నారంటూ చాలా కాలంగా ప్రచారంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

ప్ర‌స్తుతం టీడీపీ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ , ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డికి మ‌ధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. ప్ర‌భాక‌ర్ చౌద‌రికి చెక్ పెట్టేందుకే గురునాధ్‌రెడ్డిని టీడీపీలోకి తీసుకొస్తున్నార‌నె వార్త‌లు బ‌లంగా వినిపించాయి. ఇక ప‌చ్చ కండువా క‌ప్పుకోవ‌డమే మిగిలింది అన్న త‌రునంలో వైసిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో హైద‌రాబాద్‌లో భేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో ఇదే హాట్ టాఫిక్‌గా మారింది.

గుర్నాధరెడ్డిని పార్టీలోకి లాక్కోవటం ద్వారా జగన్ కు పెద్ద షాక్ ఇద్దామని టిడిపి నేతలు పెద్ద ప్లానే వేశారు. అయితే, చేరికలో జాప్యం జరుగుతుండటంతో టిడిపిలో నేతల్లో ఆందోళన కనబడుతోంది. ఇదే స‌మ‌యంలో గురునాధ్ రెడ్డి పార్టీని వదిలి వెళ్ళటం వైసిపిలోని చాలా మంది నేతలకు ఇష్టంలేదు. ఎందుకంటే, గుర్నాధ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ తో పాటు విజయమ్మకు బాగా నమ్మినబంటవ్వటమే కారణం.

జగన్-గుర్నాధ్ మధ్య ఏంజ‌రిగింద‌న్న‌ది తెలియ‌క‌పోయినా కొన్ని రోజులుగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. గురునాధ్‌రెడ్డి లోని అసంతృప్తిని గుర్తించిన టిడిపి నేతలు వల విసిరారు. ఒక వేల గురునాధ్‌రెడ్డి టీడీపీలో చేరితో మ‌ళ్లీ అనంతపురం నుండే పోటీ చేయాలని అనుకుంటున్నారు. కాని గుర్నాధ్ టిడిపిలోకి వస్తే ప్ర‌స్తుత ఎమ్మెల్యే ప్రభాకర్ పరిస్ధితేంటి? అందుకనే గుర్నాధ్ చేరికను ప్రభాకర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

గురునాధ్‌రెడ్డి మంత్రి పరిటాలసునీత, జేసీ దివాక‌ర్‌రెడ్డి మ‌ద్ద‌తు ఉంది. దాంతో ఏం చేయాలో చంద్రబాబుకూ తోచటం లేదు. జ‌గ‌న్ పాద‌యాత్ర అనంత‌పురంలోకి ప్ర‌వేశించే స‌మ‌యంలో విజ‌య‌మ్మ‌ను క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఎందుకు కలిసారు, ఏం చర్చించారన్న విషయంలో మాత్రం స్పష్టత లేక పోయినా పార్టీలో తన భవిష్యత్తుపైనే చర్చలు జరిగి ఉంటాయని పార్టీ వర్గాలంటున్నాయి.

వచ్చేనెల 5న గుర్నాధ్ పార్టీలో చేరుతున్నారంటూ టిడిపి నేతలంటున్నారు. 5వ తేదీ ముహూర్తం ఏంటంటే, పాదయాత్రలో భాగంగా జగన్ అనంతపురం జిల్లాలోకి అడుగుపెడుతున్నారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో గురునాధ్‌రెడ్డి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌ని ఇరు పార్టీ వ‌ర్గాల్లో ఉత్కంఠ‌నెల‌కొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -