Thursday, April 25, 2024
- Advertisement -

తెలంగాణాలో బాబుతో కాంగ్రెస్ పుట్టి మున‌గ‌డం ఖాయం…

- Advertisement -

త్వరలో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నికలు అన్ని రాజ‌కీయ పార్టీల‌కు సెమీఫూన‌ల్స్ లాంటివి. అందుకే అధికారంలోకి రావాల‌ని ప‌ట్టుద‌ళ‌తో ఉన్నాయి. అయితే తాజాగా ‘ఇండియా టుడే’కు చెందిన ‘పొలిటికల్ స్టాక్ ఎక్స్‌చేంజ్’(పీఎస్ఈ) నిర్వహించిన సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. తెలంగాణలో కేసీఆరే మరోసారి సీఎం అయ్యేందుకు 75శాతం అవకాశం ఉన్నట్టు ఇండియా టుడే తాజా సర్వే వెల్లడించింది. డిసెంబర్‌ 7న జరిగే ఎన్నికల్లో కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్‌) విజయం సాధించడం ఖాయమని తాజా సర్వేలో తేలింది.

మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో బీజేపీ మరోమారు విజయం సాధిస్తుందని తేల్చింది. రాజస్థాన్‌లో మాత్రం బీజేపీకి ఘోర పరాజయం తప్పదని సర్వేలో వెల్లడైంది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కేసీఆర్‌కు బోనస్ అవుతాయని సర్వే తేల్చింది. ఈ సర్వేలో మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే రావాలని 44% మంది కోరుకోగా, ప్రభుత్వం మారాలని 34% కోరుకున్నారు. మాకు తెలియదంటూ స్పందించిన వారు 22% ఉన్నారు.

అక్టోబర్ 22 నుంచి నవంబర్ 6వ తేదీ మధ్య తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల పరిధుల్లో పొలిటికల్ స్టాక్ ఎక్స్చేంజ్ (పీఎస్‌ఈ) సంస్థ ఈ శాంపిల్ సర్వే నిర్వహించింది. 6,877మంది ఓటర్ల నుంచి ఫోన్ ద్వారా వివరాలు సేకరించింది. ఈ సర్వే వివరాలను గురువారం విడుదల చేశారు. తదుపరి సీఎంగా కేసీఆర్‌కు 46%, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్‌)కి 25%, కిషన్‌రెడ్డి (బీజేపీ)కి 16%, ప్రొఫెసర్‌ కోదండరాంకు 7%, అసదుద్దీన్‌ ఒవైసీకి 4% మద్దతు పలికారు

తెలంగాణలో 75శాతం మంది ప్రజలు టీఆర్‌ఎస్ వైపే ఉన్నారని, గులాబీ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని వారంతా నమ్ముతున్నారని ఆ సర్వేలో తేలింది. 44శాతం ఓట్లతో టీఆర్‌ఎస్ ఘనవిజయం సాధిస్తుందని, 46శాతం మంది ప్రజలు కే చంద్రశేఖర్‌రావు మళ్లీ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారని సర్వే వెల్లడించింది.

ప్రతిపక్షాలు కూటమి కట్టినా ఫలితం ఉండదని ఈ శాంపిల్ సర్వే ఫలితాలు స్పష్టంచేస్తున్నాయి. కాంగ్రెస్‌కు మజ్లిస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని, ఆ పార్టీ విజయావకాశాలను మజ్లిస్ దారుణంగా దెబ్బతీస్తుందని పీఎస్ఈ వెల్లడించింది. టీడీపీ అధినేత చంద్రబాబును ఇప్పటికీ కుట్రదారుగానే తెలంగాణ ప్రజలు చూస్తున్నారని తెలిపింది. తదుపరి సీఎంగా కూడా కేసీఆరే ఉండాలని కోరుకుంటున్నవారి సంఖ్య రెండునెలల కాలంలో మూడుశాతం అదనంగా పెరిగిందని ఈ సర్వే తెలిపింది.

మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ సర్కారు మళ్లీ అధికారంలోకి రావడమని సర్వే చెప్పుకొచ్చింది. అయితే, బీజేపీ-కాంగ్రెస్ మధ్య ఓట్ల తేడా ఒకటి నుంచి మూడు శాతం మాత్రమే ఉండే అవకాశం ఉందని పీఎస్ఈ పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో 42 శాతం చౌహాన్ సర్కారుకే ఓటేయగా, 40 శాతం మంది ప్రభుత్వం మారాలని అభిప్రాయపడ్డారు. ఇక్కడ బీజేపీ 116 స్థానాల్లో, కాంగ్రెస్ 105 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.

రాజస్థాన్ విషయానికొస్తే వసుంధర రాజే ప్రభుత్వంపై మైనారిటీ, నిమ్నవర్గాల్లో ఉన్న ఆగ్రహం చేటు చేస్తుందని సర్వేలో వెల్లడైంది. రాజేకు కేవలం 35 శాతం మాత్రమే అవకాశం ఉంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు 110 స్థానాలు వచ్చే అవకాశం ఉండగా, బీజేపీ 84 స్థానాలకే పరిమితం కానుంది.

చత్తీస్‌గఢ్‌లో మాత్రం బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని పీఎస్ఈ తేల్చింది. రమణ్‌సింగ్ ప్రభుత్వం తిరిగి రావాలని 55 శాతం మంది కోరుకున్నారు. ఇక్కడ బీజేపీకి 56 సీట్లు, కాంగ్రెస్‌కు 25 సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -