Friday, March 29, 2024
- Advertisement -

తెలంగాణ లో కేసీఆర్ మాటే నెగ్గుతుందా..?

- Advertisement -

తెలంగాణాలో ఇప్పుడు ఆసక్తికర రాజకీయం కొనసాగుతుందని చెప్పొచ్చు.. ఓ వైపు దుబ్బాక ఉప ఎన్నిక, మరో వైపు గ్రేటర్ ఎన్నికలు, ఇంకో వైపు ఎమ్మెల్సీ ఎన్నికలతో తెలంగాణ లో రాజకీయం రోజు రోజు కు ఎంతో ఆసక్తి కరంగా మారుతున్నాయి.. ఇప్పటికే గ్రేటర్, దుబ్బాక ఉప ఎన్నికలకు నోటిఫికేషన్స్ రిలీజ్ చేయగా అక్కడ ప్రచార పర్వం ఇప్పటికే మొదలైపోయింది చెప్పొచ్చు. అన్ని పార్టీ లు తమ తమ ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకోగా అభ్యర్థుల ఎన్నిక విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయి.. అధికార పార్టీ కి ఈ ఎన్నికల పై పెద్దగా టెన్షన్ లేకపోయినా బీజేపీ కాంగ్రెస్ ల మధ్య భీక పోరు జరగనున్నదన్నది వాస్తవం..

ఇక ఈ ఎన్నికల్లో మొదటినుంచి కేసీఆర్ తలచినట్లు బ్యాలెట్ పద్ధతినే ఉపయోగించనున్నారు.. అయితే ఎప్పుడు ఈవీఎం లు ఉపయోగించే ఎలక్షన్స్ కమిషన్ ఇప్పుడు ఈ పద్ధతి ని ఉపయోగించి ఎలక్షన్స్ నిర్వహించడానికి కారణం అందరు కరోనా అనుకున్నారు కానీ అది కాదని తెలుస్తుంది.. ఈవీఎం లు కాకుండా బ్యాలెట్ పద్ధతిని ఉపయోగించడానికి అసలు కారణం ఈవీఎంలు…వీవీప్యాట్ లు అందుబాటులో లేకపోవడమే అంటున్నారు.. బీజేపీ పార్టీ తప్పా అన్ని పార్టీ ఈవీఎం ను వద్దని కోరగా కేసీఆర్ గట్టి పట్టు తోనే బ్యాలెట్ పద్ధతిని వాడబోతున్నట్లు తెలుస్తుంది..

గత ఎన్నికల్లో కేసీఆర్ కి ఈవీఎం పద్ధతి ద్వారా మంచే ఎక్కువగా జరిగింది కానీ అయన ఎందుకు ఈ పద్ధతిని వద్దంటున్నారో కారణం ఉంది.. అసెంబ్లీ ఎన్నికల్లో, బల్దియా ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు గ్రేటర్ పరిధిలో తిరుగులేని విజయాలొచ్చాయి.అప్పుడు కాంగ్రెస్ సహా మరికొన్ని పార్టీల నేతలు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్సే ఈవీఎంలు వద్దనుకుంటోంది. బ్యాలెట్ ప్రకారం జరిగే ఎన్నికల్లో … కొన్ని చెల్లని ఓట్లు… వస్తాయి… ఓట్ల లెక్కింపు ఆలస్యం అవుతుంది..కానీ ఫలితంపై మాత్రం ఎవరికీ అనుమానాలుండవు. అని కేసీఆర్ ఆలోచన.. మరోవైపు బీహార్‌తో పాటు ఇతర ఉపఎన్నికల్ని ప్రత్యేక జాగ్రత్తలతో ఈసీ నిర్వహిస్తున్నందున ..అలాగే గ్రేటర్ ఎన్నికలు కూడా నిర్వహించాలని బీజేపీ నేతలు పట్టుబట్టారు. కానీ ఈ విషయంలో కేసీఆర్ తన మాటే నెగ్గించుకున్నారని చెప్పాలి..

ఆ ఎన్నికలపైనే కెసిఆర్ ఫోకస్..!

కేసిఆర్ పైన కోదండ రాం ఎత్తులు ఫలించేనా..?

కెసిఆర్ ప్రభుత్వం కూల్చడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుందా..?

దుబ్బాక లో హరీష్ టీఆర్ఎస్ జైత్ర యాత్ర కొనసాగించేనా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -