Friday, March 29, 2024
- Advertisement -

విజయసాయి రెడ్డికి గుడ్ న్యూస్ చెప్పనున్న జగన్..!

- Advertisement -

రాష్ట్రంలో జరుగుతున్న ఏ పరిణామంనైన కొందరు పాజిటివ్ గా చూస్తే.. మరికొందరు నెగటివ్ గా చూస్తారు. రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలను చూస్తే విజయసాయిరెడ్డి జగన్ కు దూరం దూరమవుతున్నారని.. జగన్మోహన్రెడ్డి ఒక కుడిభుజంగా ఉన్న విజయసాయిరెడ్డి నెమ్మదిగా సైడ్ అవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఉత్తరాంధ్ర జిల్లాలకు వైకాపా ఇన్చార్జ్ గా విజయసాయి రెడ్డి ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో అంత పెద్ద నాయకుడుగా విజయసాయి రెడ్డిని జగన్ నిలబెట్టిన తర్వాత కూడా గంటా శ్రీనివాసరావు లాంటి ఉత్తరాంధ్ర కీలకనేత వైకాపా లోకి రావాలంటే ఎవరి హెల్ప్ ద్వారా రావాలి ? విజయసాయి రెడ్డే ఇన్వాల్వ్ కావాలి. ఆయన ద్వారానే ఈయన పార్టీలోకి రావాలి. ఇది చాలా నార్మల్ మేటర్ కానీ విజయసాయిరెడ్డి యొక్క సలహాలు సూచనలు సంగతి పక్కన పెడితే కనీసం విజయసాయి రెడ్డికి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా వైకాపాలోకి రావడానికి గంటా శ్రీనివాసరావు చక్రం తిప్పుతున్నారని చర్చ భారీగా నడుస్తోంది.

విజయసాయి రెడ్డి డామినేషన్ తగ్గుతోందా అంటూ వస్తున్న వార్తలకు జగన్ మోహన్ రెడ్డి ఎలా చెక్ పెడుతారనేది కూడా చర్చగా మారింది. జగన్మోహన్ రెడ్డి సహజంగా మొదటి నుంచి తనతో ఉన్నవారిని ఎవరిని కూడా వదులుకోరు. వాళ్లతోని తన యొక్క ప్రయణాన్ని ముందు తీసుకెళ్తారు. జగన్మోహన్రెడ్డి నమ్మేది విదేయత. నమ్మకం గా ఉండే వారిని నమ్మడం అనేది ఒక గొప్ప గుణంగా జగన్ మోహన్ రెడ్డి చేసుకున్నారు. నమ్మినవారికి కూడా ఏ రకమైన ఇబ్బందులు రాకుండా కూడా జగన్ మోహన్ రెడ్డి చూసుకుంటూ ఉంటారు. అయితే గంటకు వైకాపా ఎప్పుడో డోర్స్ క్లోజ్ చేసిందనే మాట కూడా వినిపించింది. అసలు గంట హవానే లేదని ఆయన పలుకుబడి కూడా పూర్తిగా పోయిందని విజయసాయి రెడ్డి అప్పట్లో గాలి కూడా తీశారు. దీనిబట్టి మనకు అర్దం అయింది ఏంటంటే వైకాపా గడప తొక్కడానికి గంటా శ్రీనివాసరావుకి విజయసాయిరెడ్డి కొంచెం కూడా ఛాన్స్ ఇవ్వరు అని.. అయితే రాజమార్గంలో రాలేక వేరే రకంగా తన ప్రయత్నాలు గంట చేసుకున్నారని ప్రస్తుతం వార్తలు స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి.

అయితే ఒకసారి గంటకు గనక జగన్ ఇన్ డైరెక్ట్ గా డోర్స్ తీస్తే అది విజయసాయి రెడ్డికి నెగిటివ్ న్యూస్ అవుతుంది. దాంతో జగన్, విజయసాయి రెడ్డిల మధ్య సన్నిహితం కాస్త అయిన తగ్గే ఛాన్స్ ఉంది. ఇది జగన్ ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునే పాయింట్ కాదు. కాబట్టి ప్రస్తుతం హెల్త్ బాలేక హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటూ ట్రీట్మెంట్ లో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి వచ్చిన తర్వాతే ఆయన ద్వారానే గంట శ్రీనివాసరావు రావాలని.. విజయసాయి రెడ్డికి బాధ్యతలు అప్ప చెప్పినటువంటి జిల్లాలో వేరే వాళ్ళు చక్రం తిప్పడానికి తాను ఒప్పుకునే సమస్య లేదని జగన్ మోహన్ రెడ్డి.. గంట ఎవరితో అయితే సంప్రదింపులు జరుపుతున్నారో వాళ్ళ ద్వారా తెలియజేశడని తెలుస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో విజయసాయి రెడ్డి హెల్త్ సెట్ అయ్యి హైదరాబాద్ నుంచి వచ్చే లోపు తన హవా తనకే ఉందని నిరూపించే పనిలో మంచి గుడ్ న్యూస్ చెప్పే పనిలో జగన్ ఉన్నట్లు అనిపిస్తోంది.

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ : కరోనా విషయంలో జగన్ షాకింగ్ నిర్ణయం..!

జగన్ మా మాట వినరు.. చెప్పుడు మాటలు వింటారు : రఘు రామకృష్ణరాజు

సుప్రీంకోర్టు తీర్పును గౌరవించండి : ప్రభుత్వానికి రాఘురామకృష్ణరాజు సూచన..!

నిమ్మగడ్డ కేసు.. సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ కు ఎదురు దెబ్బ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -