Thursday, April 25, 2024
- Advertisement -

సుప్రీంకోర్టు తీర్పును గౌరవించండి : ప్రభుత్వానికి రాఘురామకృష్ణరాజు సూచన..!

- Advertisement -

వచ్చే శుక్రవారంలోగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని జగన్ సర్కార్ ను సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం జగన్ ను ఉద్దేశించి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన కామెంట్స్ చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవించి నిమ్మగడ్డను తిరిగి ఎస్ఈసీగా నియమించాలని ఆయన కోరారు.

నిమ్మగడ్డను కోర్టు తీర్పు మేరకు నిమిస్తే అందులో తప్పేం ఉందని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం సరైనదని… కరోనా మహమ్మారి నుంచి ఆ నిర్ణయం ప్రజలను కాపాడిందని ఆయన చెప్పారు. కోర్టులకు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్లే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రఘురాజు అన్నారు. మనది రాచరిక వ్యవస్థ కాదని, ప్రజాస్వామ్య దేశమని… న్యాయ వ్యవస్థలను, కోర్టులను గౌరవిద్దామని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయడమే తన తప్పైపోయిందని చెప్పారు. 22 మంది ఎంపీలను మీకు అప్పగిస్తాం… రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని ఢిల్లీకి వచ్చి వేడుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా భారీ మెజార్టీతో ఎన్నికైన ప్రభుత్వం మనదని అన్నారు. పక్కనున్న వారి మాటలు విని ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకోవద్దని సూచించారు. రాజ్యాంగం మీద అవగాహన లేని కొందరు చేసే ఫిర్యాదుల కారణంగా తనకు ఏం కాదని చెప్పారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధి గొంతును నొక్కే ప్రయత్నం చేయొద్దని ఆయన అన్నారు.

గంటా శ్రీనివాస్ రావు నిర్ణయంతో సీఎం జగన్ హ్యాపీ ?

విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్..!

మంత్రి సుచరిత ఘోర అవమానం.. ఏం జరిగింది ?

రోజాకు సీఎం జగన్ గూడ్ న్యూస్.. ఏంటంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -