Saturday, April 20, 2024
- Advertisement -

జగన్ మా మాట వినరు.. చెప్పుడు మాటలు వింటారు : రఘు రామకృష్ణరాజు

- Advertisement -

నిమ్మగడ్డ రమేష్ అంశంలో ఏపీ సర్కార్ కు సుప్రీం కోర్టు షాకిచ్చిన విషయం తెలిసిందే. వచ్చే శుక్రవారంలోగా నిమ్మగడ్డ అంశంలో హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీం కోర్టు తీర్పును వెలువరించిన తర్వాత వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సుప్రీం కోర్టులో ఇదే జరుగుతుందని తనకు ముందే తెలుసని తెలిపారు. న్యాయ వ్యవస్థతో చీవాట్లు పెట్టించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అనోసరంగా న్యాయ వ్యవస్థతో పెట్టుకోవద్దని.. ఆర్టికల్ 356ని కొని తెచ్చుకోవద్దని హెచ్చరించారు(రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ కింద ఏ రాష్ట్రంలోనైనా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలనను విధించవచ్చు).

ఇక సీఎం జగన్ గారు చెప్పుడు మాటలు విని.. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూంటారని రఘురామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఇచ్చే సలహాలను సీఎం జగన్ స్వీకరించరని.. ఎంతో ఎంతోమంది సలహాదారులను ఆయన నియమించుకున్నారని, వారేమో సరైన సలహాలను ఇవ్వరని ఎద్దేవా చేశారు. న్యాయ వ్యవస్థను కించపరుస్తూ, దుర్భాషలాడుతూ వైసీపీ నేతలు కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని.. అలాంటి వారికి పార్టీ పెద్దల సపోర్ట్ ఉందని విమర్శించారు. మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనుకుంటే… కోర్టులు చూస్తూ ఊరుకోవని అన్నారు. ఆర్టికల్ 356 ఎంతో దూరంలో లేదనే విషయంను రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలని అన్నారు.

సుప్రీంకోర్టు తీర్పును గౌరవించండి : ప్రభుత్వానికి రాఘురామకృష్ణరాజు సూచన..!

నిమ్మగడ్డ కేసు.. సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ కు ఎదురు దెబ్బ..!

వైసీపీ మంత్రులకే వార్నింగ్ ఇచ్చిన రోజా.. ఎందుకు ?

చంద్రబాబును నమ్మలేం.. ఆలోచనలో గవర్నర్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -