Friday, March 29, 2024
- Advertisement -

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ : కరోనా విషయంలో జగన్ షాకింగ్ నిర్ణయం..!

- Advertisement -

ఏపీలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. దాంతో సీఎం జగన్ పలు నిర్ణయాలను తీసుకుంటున్నారు. తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయం ఎంతో మంది రోగులకు అత్యవసర పరిస్దితుల్లో ప్రాణాలు కాపాడనుంది. ఇప్పటివరకూ మలేరియా మాత్రలతోనే కాలక్షేపం చేస్తున్న వైద్యులకు కూడా అత్యవసర సమయాల్లో ఉపయోపడబోతోంది. ఏపీలో కరోనా అంత ఈజీగా పోదని ముందే అంచనా వేశారు సీఎం జగన్. అందుకే ప్రాణాంతక వైరస్ తో సహజీవనం చేయక తప్పదని అప్పట్లో అంటే అందరు నవ్వుకున్నారు.

కానీ అది ఇప్పుడు నిజమని తెలిసి ముక్కు మీద వేలు ఏసుకుంటున్నారు. ఏది ఏమైన ప్రజలను కాపాడే బాధ్యత తనపై ఉందని ఎప్పటికప్పడు మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు సీఎం జగన్. ఇదే క్రమంలో జగన్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. కరోనా అత్యవసర చికిత్సలో భాగంగా వాడుతున్న రెమ్‌డెసివిర్ మాత్రలను వాడాలా వద్దా అని రాష్ట్రాలు తటపటాయిస్తున్న వేళ.. జగన్ మాత్రం ఇందుకు సై అనేశారు. హెటిరో ఉత్పత్తి చేస్తున్న రెమిడెసివిర్ మాత్రలను భారీ స్ధాయిలో అందుబాటులోకి తీసుకురావాలని జగన్ తాజాగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

దీంతో హెటిరో నుంచి తొలి దశలో దాదాపు 15 వేల డోసులకు పైగా ఆర్డర్ ఇచ్చారు. వీటిలో ఇప్పటికే ఐదు వేల డోసులు రాష్ట్రానికి రాగా.. మరో పది వేల డోసులు ఇవాళ రాష్ట్రానికి రానున్నాయి. వీటిని ఇవాళ సాయంత్రం నుంచి కరోనా ప్రత్యేక ఆస్పత్రుల్లో అత్యవసర మందులుగా అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో అత్యవసర పరిస్ధితుల్లో ప్రాణాలు కోల్పోతున్న రోగులకు తక్షణ ఉపశమనం లభించనుంది. కోవిడ్ 19 ఆస్పత్రులకు తొలిదశలో 15 వేల రెమ్‌డెసివిర్ డోసులను పంపిస్తున్నారు. వీటిని ఒక్కో రోగికి రెండు, మూడు సార్లు అందించాల్సి ఉంటుంది. ఈ లెక్కన భారీగా డోసులు అవసరం అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ప్రభుత్వ వినతి మేరకు హెటిరో డ్రగ్స్… ఆగస్టు మూడో వారం నాటికి మరో 70 వేల డోసులను ఏపీకి పంపబోతోంది. 15 వేల మంది ప్రాణాలు కాపాడేందుకు దాదాపు 90 వేల డోసులు ఉంటే సరిపోతుందని నిపుణులు ప్రాధమికంగా అంచనా వేశారు. కరోనా సోకిన వారిపై హోమో క్వోరోక్విన్, హైడ్రాక్సీ క్వోరోక్విన్ వంటి మలేరియా మాత్రలతోనే నయం చేస్తున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ మాత్రలు కూడా పని చేయడం లేదు. దీంతో ప్రభుత్వంతో పాటు డాక్టర్లపైనా ఒత్తిడి పెరుగుతోంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం రెమ్‌డెసివిర్ ను అందుబాటులోకి తెస్తుండటంతో రోగులతో పాటు డాక్టర్లకూ ఊరట దక్కనుంది. అయితే వీటిని ఏయే పరిస్దితుల్లో వాడాలో ప్రభుత్వం ఇప్పటికే డాక్టర్లకు దిశానిర్దేశం చేసింది.

జగన్ మా మాట వినరు.. చెప్పుడు మాటలు వింటారు : రఘు రామకృష్ణరాజు

సుప్రీంకోర్టు తీర్పును గౌరవించండి : ప్రభుత్వానికి రాఘురామకృష్ణరాజు సూచన..!

నిమ్మగడ్డ కేసు.. సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ కు ఎదురు దెబ్బ..!

చంద్రబాబును నమ్మలేం.. ఆలోచనలో గవర్నర్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -